Breaking News

రాజా విక్రమార్క ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్.. హీరో మనవరాలితో కార్తికేయ రొమాన్స్


తొలి సినిమా Rx100 తోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన .. వరుసపెట్టి విలక్షణ కథలను ఎంచుకుంటున్నాడు. ''హిప్పీ, గుణ 369, 90 ML, చావు కబురు చల్లగా'' లాంటి సినిమాలతో అలరించిన ఆయన మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడితో '' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ పోస్టర్‌లో ఆఫీస్ టేబుల్ పక్కన పడుకుని పైకి చూస్తున్నట్టుగా ఉన్నకార్తికేయ లుక్ ఆసక్తి రేకెత్తిస్తోంది. డిఫరెంట్ స్టోరీలైన్‌తో రాబోతున్న ఈ మూవీని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ ఫస్ట్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రామారెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజులు వాయిదా పడింది. అయితే మళ్ళీ షూటింగ్స్‌కి పర్మిషన్ రావడంతో అతిత్వరలో సెట్స్ మీదకు రావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీ సాయి కుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. సో.. చూడాలి మరి కార్తికేయ కెరీర్‌కి ఈ మూవీ ఎంతవరకు ప్లస్ అవుతుందనేది.


By June 20, 2021 at 01:58PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-karthikeyas-raja-vikramarka-first-look-release/articleshow/83685426.cms

No comments