Breaking News

New IT Rules వ్యక్తిగత గోప్యతకు భంగం.. కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్!


సోషల్ మీడియా, ఓటీటీల్లో అశ్లీల కంటెంట్, తప్పుడు వార్తల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో వెలువరించి ఐటీ మార్గదర్శకాలు బుధవారం నుంచి పూర్తిస్తాయిలో అమల్లోకి వచ్చాయి. ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థలు ఈ నిబంధనలు పాటించడానికి సిద్ధమయ్యాయి. ఈ నియమ నిబంధనలపై ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మాత్రం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిం. ఈ నిబంధనలను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. కొత్త నిబంధనలు వినియోగదారుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలిగించేలా ఉన్నాయని వాట్సాప్‌ ఆరోపించింది. కొత్త నిబంధనల ప్రకారం.. దేశ సార్వభౌమత్వం, రక్షణకు సంబంధించిన ఐదైనా సమాచారాన్ని లేదా ప్రజల భద్రతకు హాని కలిగించేలా తప్పుడు పోస్టులు పెడితే.. వారి గురించి ప్రభుత్వానికి సోషల్ మీడియా వేదికలు వెల్లడించాల్సి ఉంటుంది. అయితే రాజ్యాంగం ప్రకారం ఇది వ్యక్తిగత గోప్యత హక్కులను ఉల్లంఘించినట్లేనని వాట్సాప్‌ వాదిస్తోంది. వాట్సాప్‌లో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలు ఉంటాయని, ఒకవేళ కొత్త ఐటీ నిబంధనలను అనుసరిస్తే వీటిని పక్కనపెట్టాల్సి వస్తోందని వాట్సాప్‌ వాదిస్తోంది. అందువల్ల ఈ నిబంధనలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ ఎప్పుడు చేపడుతుందో తెలియరాలేదు. కొత్త నిబంధనల అమలుకు చర్యలు చేపడతామని వాట్సాప్‌ మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ వెల్లడించడం గమనార్హం. వాట్సాప్‌కు భారత్‌లో 400 మిలియన్లకుపైగా యూజర్లు ఉన్నారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన .. 2017లో వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించినట్టు రాయిటర్స్ పేర్కొంది. కొత్త ఫిబ్రవరిలోనే అమల్లోకి తెచ్చినా.. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌ లాంటి దిగ్గజ సోషల్‌ మీడియా సంస్థలకు మాత్రం వీటి అమలుకు 3 నెలల గడువు కల్పించింది. అది మంగళవారంతో ముగిసింది. అంటే.. బుధవారం నుంచి కొత్త నియమ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.


By May 26, 2021 at 01:24PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/whatsapp-filed-law-suit-against-new-digital-rules-in-delhi-high-court-mean-end-to-user-privacy/articleshow/82968621.cms

No comments