Breaking News

చిచ్చురేపిన కులాంతర వివాహం.. ఒంగోలులో తండ్రీ కొడుకుల కిడ్నాప్


కేంద్రం పట్టణంలో కులాంతర వివాహం ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్‌‌కు కారణమైంది. ఒంగోలుకు చెందిన తలకాయల వినోద్‌ గత ఏడాది ఆగస్టు 14న కడప జిల్లా రాజంపేటకు చెందిన వనజ అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి సామాజిక వర్గాలు వేరు కావడంతో వనజ కుటుంబం ఈ పెళ్లిని వ్యతిరేకించింది. దీనిపై కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. ఇరు వర్గాలపై ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. Also Read: ఈ క్రమంలో ఈ నెల రెండో తేదీన వినోద్‌ తండ్రి గోపాల్‌, సోదరుడు మధు ద్విచక్ర బైక్‌పై బయటికి వెళ్లారు. ఆ సమయంలోనే రాజంపేట నుంచి వచ్చిన వనజ తండ్రి అన్నారెడ్డి లక్ష్మణ స్వామిరెడ్డి, అతడి కుమారుడు దినేష్‌ రెడ్డితో పాటు మరికొందరు సీఆర్‌పీ క్వార్టర్స్‌ వద్ద గోపాల్‌, మధులను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. కారులో వారిని దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. వినోద్‌, వనజ నెల్లూరులో ఉంటున్నారని చెప్పటంతో అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ కడప జిల్లా బద్వేలు వరకు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. Also Read: బద్వేలులో వారిద్దరిని దించేసి మాపై కేసు పెడితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. బాధితులు అక్కడి నుంచే ఒంగోలు రూరల్ సీఐకి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. దీంతో సీఐ తన సిబ్బంది సాయంతో వారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


By January 04, 2021 at 08:01AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-men-kidnapped-in-ongole-town-over-inter-caste-marriage/articleshow/80089636.cms

No comments