Breaking News

దేశంలో 27 నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు.. ప్రతి ప్రధాన నగరంలో: మోదీ


కప్పుడు దేశంలో అనే అలోచనే లేదని.. ప్రస్తుతం దేశంలో ప్రతి ప్రధాన నగరంలోనూ మెట్రో రైలు సదుపాయం అందుబాటులోకి రానుందని ప్రధాని నరేంద్రం మోదీ అన్నారు. దేశంలోని 27 నగరాల్లో 1000 కిలోమీటర్లకు పైగా నిడివి గల మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. అహ్మదాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ రెండో దశ, సూరత్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌లకు సోమవారం (జనవరి 18) ఆయన భూమిపూజ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో రెండు ప్రధాన వాణిజ్య కేంద్రాలైన అహ్మదాబాద్‌, సూరత్‌ నగరాల్లో రవాణా సౌకర్యాలు మెరుగవుతాయని ప్రధాని పేర్కొన్నారు. మెట్రో ప్రాజెక్టు ఈ రెండు నగరాల ప్రజలకు పర్యావరణహిత ప్రజా రవాణా సాధనం అవుతుందని తెలిపారు. ‘కొన్నేళ్ల కిందటి వరకు దేశంలో ఆధునిక ఆలోచనలకు గానీ, కొత్త పాలసీల రూపకల్పనకు గానీ తావులేదు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2014కు ముందు భారత్‌లో కేవలం 225 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గం మాత్రమే అందుబాటులో ఉండేది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆరేళ్లలో 450 కి.మీ. మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది’ అని ప్రధాని అన్నారు.


By January 18, 2021 at 02:35PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/1000-km-metro-rail-network-in-27-cities-across-india-pm-modi/articleshow/80326941.cms

No comments