Breaking News

ఇదేం కరోనా.. భార్యకు ముద్దు కూడా పెట్టలేకపోయా: మాజీ సీఎం


మ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా.. కరోనా మహమ్మారి గురించి మాట్లాడుతూ నవ్వులు పూయించారు. కరోనా సంక్షోభ సమయంలో తన భార్యకు ముద్దు కూడా పెట్టలేకపోయానని అన్నారు. కౌగిలింత ఇవ్వాలని ఉన్నా.. అలా చేయలేకపోయానని వాపోయారు. కశ్మీర్ రాజకీయాల్లో కురువృద్ధుడైన ఫరూక్.. ఆదివారం (జనవరి 17) శ్రీనగర్‌లో ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 35 నిమిషాల పాటు ప్రసంగించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని, తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని అన్నారు. ‘ఇప్పటికీ ఎదుటి వ్యక్తితో చేతులు కలపడానికి భయమేస్తోంది. ఆలింగనం చేసుకోడానికి ఆందోళనగా ఉంది. నేనైతే నా భార్యకు ముద్దు కూడా పెట్టలేదు. ఏమో.. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఇక కౌగిలింత ప్రసక్తే లేదు.. మనసెంత కోరుకున్నా సరే. నేను నిజాయతీగా చెబుతున్నా..’ అని ఫరూక్ అన్నారు. తాను మాస్కు లేకుండా కనిపిస్తే తన కుమార్తె వెంటనే మందలించేదని ఫరూక్ తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో నేటికీ కరోనా వైరస్ కారణంగా వందలాది మంది మరణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ‘ఇక ఇప్పుడైతే కొవిడ్‌ వ్యాక్సిన్లు వచ్చాయి. టీకాల సామర్థ్యం గురించి కాలమే చెబుతుంది. కానీ, నేను శాస్త్రవేత్తల కృషి ఫలించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా.. అప్పుడుగానీ పరిస్థితులు సాధారణ స్థితిలోకి రావు’ అని ఫరూక్ అన్నారు.


By January 18, 2021 at 03:20PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/not-even-kiss-my-wife-farooq-abdullah-comments-on-coronavirus-pandemic/articleshow/80327783.cms

No comments