Breaking News

Krack: భలేగా తగిలావే బంగారం.. క్రాక్ నుంచి రవితేజ మాస్ పెప్పీ సాంగ్ రిలీజ్


మాస్ మహారాజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ''. క్యాచీ టైటిల్, డిఫరెంట్ స్టోరీ లైన్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా చిత్రంలోని ''భలేగా తగిలావే బంగారం'' సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మాస్ మహారాజ్ రవితేజ ఎనర్జీకి శృతి హాసన్ స్పైసీ లుక్ తోడు కావడంతో మరింత స్పెషల్‌గా ఆకట్టుకుంటోంది. ఎస్ఎస్ తమన్ స్వరపరిచిన ఈ పాటను యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాడటం విశేషం. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఆద్యంతం రవితేజ మాస్ ఎనర్జీని హైలైట్ చేస్తూ ఈ సాంగ్ చిత్రీకరించారని తెలుస్తోంది. Also Read: గతంలో రవితేజ- గోపీచంద్ మ‌లినేని కాంబోలో వచ్చిన ''డాన్‌ శీను, బలుపు'' చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ హ్యాట్రిక్ మూవీ 'క్రాక్'పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారని టాక్. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది.


By December 13, 2020 at 01:03PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/balega-tagilavey-bangaram-song-released-from-raviteja-krack/articleshow/79704563.cms

No comments