బ్రిడ్జిపై ఆగిన ట్రాఫిక్.. కార్లని గుద్దుకుంటూ పోయిన లారీ.. ఘోరం
సినిమాలో యాక్షన్ సీన్‌ని తలపించే రీతిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జిపై ట్రాఫిక్ ఆగి ఉన్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ ముందు ఉన్న కార్లను గుద్దుకుంటూ వెళ్లిపోయింది. కార్లు చెక్కముక్కల్లా విరిగిపోయి చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒళ్లుగగుర్పాటు కలిగించే ఈ ఘోర ప్రమాదం తమిళనాడులో జరిగింది. ధర్మపురి జిల్లా పరిధిలో బెంగళూరు - చెన్నై జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన లారీ హైవేపై వెళుతోన్న వాహనాలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. బ్రిడ్జి మీద ఈ ఘటన జరగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురిగి గాయాలయ్యాయి. ఎనిమిది కార్లు ధ్వంసమయ్యాయి. వేగంగా వెనుక వస్తోన్న వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. భారీ కంటైనర్‌ను, సిమెంట్ ట్రైలర్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వాహనాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. స్థానికుల సాయంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కార్లలో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీశారు. ఇప్పటి వరకు 10 మందిని బయటకు తీయగా, ఇంకా వాహనాల్లో ఇరుక్కున్న క్షతగాత్రులను రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. బెంగళూరు నుంచి చెన్నై వస్తున్న లేన్ లో ఈ ప్రమాదం జరిగింది. Also Read:
By December 13, 2020 at 01:05PM
No comments