ఏంటి.. బూతులా? పనికిమాలిన సన్నాసులు.. చాగంటి కోటేశ్వర్ రావు ప్రవచనాలు వినండి.. రెచ్చిపోయిన నాగబాబు
కొన్నేళ్ల పాటు జబర్దస్త్ షోకి జడ్జ్‌గా కొనసాగి నవ్వుల రారాజుగా పేరొందిన మెగా బ్రదర్ ప్రస్తుతం ఆ షోకి గుడ్ బై చెప్పేసి మరో ఛానల్‌లో 'అదిరింది' ద్వారా ఫన్ ట్రీట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోస్‌లో పాల్గొన్న ఎంతోమంది కమెడియన్స్ సినిమా అవకాశాలు పొంది సక్సెస్‌ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నారు. అయితే దీంతో పాటు స్వతహాగా కొత్త టాలెంట్‌ను గుర్తించి వాళ్లను వెలుగులోకి తీసుకు రావాలని డిసైడ్ అయిన నాగబాబు.. తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా '' అంటూ స్టాండప్ కామెడీకి తెరలేపారు. స్టాండప్ కామెడీ 'ఖుషీ ఖుషీగా' ప్రోమో: కామెడీ చేయగల సత్తా ఉన్నోళ్లు ఐదు నిమిషాల పాటు కామెడీ చేసిన వీడియోలు పంపాలని గతంలో పిలుపునిచ్చిన మెగా బ్రదర్.. అలా వచ్చిన వీడియోల్లోంచి కొందరిని సెలక్ట్ చేసి పోయిన వారం స్టాండప్ కామెడీ 'ఖుషీ ఖుషీగా' ప్రోమో వదిలారు. ఈ ప్రోమో వీడియోలో కంటెస్టెంట్లంతా డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రెచ్చిపోవడంతో 'ఖుషీ ఖుషీగా' అనేది ఓ బూతు ప్రోగ్రాం అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ చూసి నాగబాబు తనదైన స్టైల్‌లో రియాక్ట్ అవుతూ అలాంటి వారిపై ఫైర్ అయ్యారు. ప్రతి పనికిమాలిన సన్నాసి ఇలాంటి మాటలే..: ''ఖుషీ ఖుషీగా ప్రోమో చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అనుకున్నదాన్ని మించిన రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేశారు. ప్రపంచం ముందుకెళ్తుంటే ప్రతి పనికిమాలిన సన్నాసి ఇలాంటి మాటలే మాట్లాడతాడు కాబట్టి వాళ్లను అస్సలు లెక్కలోకే తీసుకోము. కాకపోతే ప్రపంచ దేశాలతో పాటు హిందీ, తమిళ్‌లో ఎంతో ఫేమస్ స్టాండప్ కామెడీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలి, చాలామంది కమెడియన్స్‌ని వెలుగులోకి తీసుకురావాలని మాత్రమే ఈ షో ప్లాన్ చేశాము. కొన్నిసార్లు బూతుమాటలు రావొచ్చు: స్టాండప్ కామెడీ అంటే.. మీరు చూసే రెగ్యులర్ జబర్దస్త్, అదిరింది లాంటి కామెడీ కాదిది. ప్రత్యేకమైన టాలెంట్ ఉంటేనే చేయగలిగే కామెడీ. ఓ వ్యక్తి తన సొంత అనుభవాలను జొప్పిస్తూ చేసే కామెడీ ఇది. అయితే ఇందులో కొన్నిసార్లు వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి బూతుమాటలు రావొచ్చు. అలాగని వారిని తప్పుబట్టొద్దు. వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. ఇందులో రిస్ట్రిక్షన్స్ ఉండవు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసున్న వ్యక్తుల కోసమే: ముఖ్యంగా ఈ స్టాండప్ కామెడీని 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసున్న వ్యక్తుల కోసం రూపొందిస్తున్నాం. పైగా యూట్యూబ్‌లో అందిస్తున్నాం కాబట్టి చూడాలా చూడకూడదా అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం. ఇందులో బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఈ కామెడీలో ఓ ఫ్లో ఉంటుంది. ఇది సరిహద్దులు లేకుండా చేసే కామెడీ. అంత ఇబ్బందిగా అనిపిస్తే చూడకండి. అంతేగానీ చూసి చెడు కామెంట్స్ వద్దు. మరీ వల్గారిటీ ఉంటే మేమే కట్ చేస్తాం. ప్రవచనాలు వినండి: చాలామంది మహానుభావులు, పవిత్రమైన వ్యక్తులు ఇలాంటి షో చేయకూడదు ఇబ్బందిగా ఉందని నాతో అంటున్నారు. వాళ్ళందిరికీ నా మనవి ఒక్కటే.. మనకు చాగంటి చాగంటి కోటేశ్వర్ రావు, గరికపాటి నరసింహా రావు గారు, చినజీయర్ స్వామి లాంటి గొప్ప వ్యక్తులు మంచి మంచి ప్రవచనాలు చెబుతుంటారు. నేను కూడా వాటిని చూస్తుంటా. ఎవరైతే బాగా ఫీల్ అవుతున్నారో అలాంటివి మాత్రమే చూడండి'' అన్నారు నాగబాబు.
By December 13, 2020 at 12:25PM
No comments