Breaking News

Alia Bhatt: నిద్రలోనూ అదే కలవరింత.. అంతలా లీనమైపోయా! RRR అనుభవాలు పంచుకున్న ఆలియా


బాహుబలి సిరీస్ తర్వాత మళ్ళీ అదే రేంజ్ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టారు దర్శక ధీరుడు . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్న ఆయన.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ని తోనే తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయిన ఆలియా.. తాజాగా RRR షూటింగ్ అనుభవాలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు RRRలో నటిస్తుండటం తనకు ఎంతో ఆనందాన్నివ్వడమే గాక విభిన్నమైన అనుభూతి కలిగించిందని ఆలియా అన్నారు. తనకు తెలుగు మాట్లాడటం రాదని, ఈ మూవీ కోసమే ప్రత్యేకంగా తెలుగు నేర్చుకున్నానని ఆమె చెప్పారు. ఏడాదిన్నర కాలంగా తెలుగుతో కుస్తీపడుతున్నానని, ఈ సినిమా డైలాగ్స్‌ బాగా ప్రాక్టీస్ చేశానని అన్నారు. టీ, టిఫిన్, భోజనం ఇలా ప్రతి సందర్భంలోనూ అవే ప్రాక్టీస్ చేశానని తెలిపారు. అలా చేస్తుండటంతో నిద్రలోనూ అవే గుర్తుకువచ్చేవని, అప్పుడప్పుడూ అవే డైలాగ్స్ కలవరించేదాన్నని చెప్పారు. RRRలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. రామ్ చరణ్ సరసన సీతగా ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, హాలీవుడ్‌ నటుడు రేయ్‌ స్టీవ్‌సన్‌, ఎలిసన్‌ డ్యూడీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు సినిమాకు భారీ రేంజ్ ప్రమోషన్స్ చేస్తున్నారు జక్కన్న. ఇందులో భాగంగా మార్చి నెలలో విడుదలైన రామ్ చరణ్ 'భీమ్ ఫర్ రామరాజు' వీడియో యూట్యూబ్‌లో దుమ్ముదులపగా.. దసరా కానుకగా విడుదలైన ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీమ్' వీడియో ఆన్‌లైన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ RRR (రౌద్రం రణం రుధిరం) మూవీపై మెగా, నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


By December 26, 2020 at 12:50PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/alia-bhatt-says-about-how-she-learn-telugu-for-rrr-movie/articleshow/79964610.cms

No comments