Breaking News

ఈ రోజున ఇలా ఉన్నానంటే కారణం ఆమెనే.. మంచు లక్ష్మి ఎమోషనల్ మెసేజ్


టాలీవుడ్ సెలబ్రిటీల్లో మంచు మోహన్ బాబు డాటర్, సినీ నటి మంచు లక్ష్మిది ప్రత్యేకమైన దారి. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఆమె.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్ అనే మాట మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ అప్‌డేట్స్ తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే .. తాజాగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తన కూతురు విద్యా నిర్వాణను ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. చిల్డ్రన్స్ డే, దీపావళి రెండూ కలసి రావడంతో ఇంటిని రంగురంగుల లైట్లతో అందంగా అలంకరించి పండగ సెలబ్రేట్ చేసుకున్నారు మంచు లక్ష్మి. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పాపులర్ సాంగ్ 'బుట్టబొమ్మ'కు కూతురు విద్యా నిర్వాణతో కలిసి స్టెప్పులేశారు మంచు లక్ష్మి. అలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసిన ఈ వీడియోను తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆమె, తన కూతురిపై ఉన్న అమితమైన ప్రేమను బయటపెడుతూ సందేశమిచ్చారు. Also Read: ''ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నివి. అందుకే నివితల్లికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నా. ఓ తల్లిగా ఇలా స్ట్రాంగ్‌గా ఉండేందుకు కావాల్సిన శక్తిని ఇచ్చింది ఆమెనే. ఐ లవ్ యూ నివి.. నీతో ఇలా ఎంజాయ్ చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది'' అంటూ మంచు లక్ష్మి పెట్టిన పోస్ట్.. కూతురు విద్యపై ఆమెకున్న ప్రేమను చాటిచెబుతోంది. ప్రస్తుతం ఆమె చేసిన బుట్టబొమ్మ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పుడేకాదు గతంలో చాలాసార్లు తన కూతురే సర్వసం అంటూ విద్యానిర్వాణపై ప్రేమ కురిపించారు మంచు లక్ష్మి. విద్యా తన జీవితంలోకి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, ఆమెనే తన జీవితానికి అందమైన అర్థాన్నిచ్చిందని తెలిపారు. ఇకపోతే.. చిన్నతనం నుంచే విద్య కెరీర్ పట్ల శ్రద్ద తీసుకుంటున్న మంచు లక్ష్మి.. ఆమెతో ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టించారు. ఈ ఛానెల్ ద్వారా తన టాలెంట్ బయటపెట్టే ప్రయత్నాలు చేస్తోంది విద్యానిర్వాణ. Also Read:


By November 15, 2020 at 11:10AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/manchu-lakshmi-shared-butta-bomma-video-with-emotional-message/articleshow/79229857.cms

No comments