Breaking News

తప్పిపోయిన పోలీస్ అధికారి.. 15 ఏళ్ల తర్వాత ఫుట్‌పాత్‌పై గుర్తించిన సహచరులు!


పదిహేనేళ్ల కిందట కనిపించకుండా పోయిన మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్ అధికారిని అతని సహచరులు యాదృశ్చికంగా ఓ ఫుట్‌పాత్‌పై గుర్తించారు. మతిస్థిమితం కోల్పోయి, శారీరకంగా శుష్కించి, గజగజా వణికిపోతూ గ్వాలియర్‌లోని ఓ ఫుట్‌పాత్‌పై బిచ్చగాడిలా పడి ఉన్నాడు. డీఎస్పీలు రత్నేశ్ సింగ్ తోమర్, విజయ్ సింగ్ బహదూర్‌లు మంగళవారం రాత్రి నగరంలోని ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా బిచ్చగాడి మాదిరిగా ఉన్న ఓ వ్యక్తి వారి కంటబడ్డాడు. గజగజా వణుకుతూ ఫుట్‌పాత్‌పై ఎవరో తినగా మిగిలిపోయిన ఆహారం కోసం వెతుకుతున్నాడు. Read Also: అతడి దీనస్థితికి చలించిపోయిన ఇద్దరు అధికారులు.. వాహనం దిగి తమ జాకెట్ అందజేసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అతడు ఆ ఇద్దరి అధికారులను పేర్లతో పిలవడంతో ఆశ్చర్యపోయారు. ఈ షాక్ నుంచి తేరుకున్న అధికారులు అతను మరెవరో కాదని, 2005లో తప్పిపోయిన మాజీ సహోద్యోగి మనీష్ మిశ్రా అని గ్రహించారు. Read Also: దేతియాలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తు సమయంలోనే మనీశ్ తప్పిపోయాడు. డీఎస్పీ రత్నేశ్ సింగ్ తోమర్ మాట్లాడుతూ.. ఇన్నేళ్లూ తను ఎక్కడున్నాడో తెలియదని అన్నారు. ఆపై అతని కోసం గాలించినా ప్రయోజనం లేకపోయిందని, ఇన్నాళ్లకు అతను తిరిగి కనిపించాడని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గ్యాలియర్ క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేస్తున్న రత్నేశ్ తోమర్, మనీశ్‌లు ఒకే బ్యాచ్‌కు చెందినవారు. Read Also: మనీశ్‌ను ఓ స్వచ్ఛంద సంస్థకు తరలించామని, తదుపరి ఏర్పాట్లు చేసేవరకు అక్కడే ఉంటాడని మనీశ్‌, బహదూర్‌ తెలిపారు. మనీశ్ గురించి తోమర్ మాట్లాడుతూ.. ‘మనీశ్ మిశ్రా చాలా మంచి అథ్లెట్, షార్ప్ షూటర్.. మేమిద్దం 1999లోనే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరాం.. కొన్నేళ్ల తర్వాత అతడిని మానసిక సమస్యలు వేధించాయి.. కుటుంబసభ్యులు చికిత్స చేయించారు... కానీ, అనుకోకుండా తప్పిపోయాడు’ అన్నారు. Read Also: ‘మేము తనకు స్నేహితులం.. అందుబాటులో ఉన్న మంచి వైద్యం అందజేసి, సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తాం’ అని అన్నారు.


By November 15, 2020 at 10:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/madhya-pradesh-police-officer-find-missing-ex-colleague-on-footpath-after-15-years/articleshow/79229429.cms

No comments