వేటకి తీసుకెళ్లి భార్యని వేటాడిన భర్త.. గుంటూరులో భయానక ఘటన
జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యని నమ్మకంగా తీసుకెళ్లి తల నరికి చంపాడో కసాయి భర్త. తల, మొండెం వేరు చేసి పడేసిన భయానక ఘటన కలకలం రేపింది. సమీపంలోని సముద్ర తీరం మడ అడవుల్లో ఈ దారుణ ఘటన జరిగింది. నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చిప్పల నాగరాజు, మరియమ్మ(40) దంపతులు. చేపల వేటకెళ్లి జీవనం సాగిస్తున్నారు. భర్త నాగరాజు మద్యానికి బానిస కావడంతో భార్య గొడవపడుతుండేది. రోజూ తాగి రావడంపై నిలదీసింది. దీంతో కోపం పెంచుకున్న భర్త దారుణానికి ఒడిగట్టాడు. రోజు మాదిరిగా చేపల వేటకు తీసుకెళ్లి అమానుషంగా చంపేశాడు. భార్య తల నరికి కిరాతకంగా హత్య చేశాడు. మొండెం నుంచి తలను వేరుచేసి పడేశాడు. అనంతరం ఏమీ ఎరగనట్టు ఇంటికి వచ్చేశాడు. అమ్మ ఎక్కడని కొడుకు అడిగినా సమాధానం ఇవ్వలేదు. స్థానికుల సాయంతో బోట్లలో చేపల వేటకు వెళ్లే మడ అడవుల వద్ద గాలించడంతో మరియమ్మ మృతదేహం కనిపించింది. తల, మొండెం వేరుచేసిన మృతదేహాన్ని చూసి షాకయ్యారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. Also Read:
By November 21, 2020 at 11:24AM
No comments