Breaking News

అంగరంగ వైభవంగా రిసెప్షన్.. అంతలోనే ఆగిపోయిన పెళ్లి.. చిత్తూరులో షాకింగ్ ఘటన


వరుడి తరఫు బంధువులు.. వధువు వైపు చుట్టాలతో కళ్యాణ మండపం కళకళలాడింది. రాత్రి వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయాన్నే వివాహం. ఇంతలోనే అర్ధరాత్రి వేళ ఊహించని అవాంతరం ఎదురైంది. కల్యాణ మండపంలోకి ఖాకీలు రావడంతో అంతా షాక్‌కి గురయ్యారు. నవవధువు మాత్రం అందరికీ అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడంతో పంచాయితీ పోలీస్ స్టేషన్‌కి చేరింది. పెళ్లి పెటాకులు కావడంతో వరుడి కుటుంబం మండపం నుంచి వెళ్లిపోయింది. ఈ షాకింగ్ ఘటన జిల్లాలో జరిగింది. కడప జిల్లాకు చెందిన యువతి చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఇటీవల ఆమె తల్లిదండ్రులు గుర్రంకొండకి చెందిన ఓ ఉద్యోగితో వివాహం నిశ్చయం చేశారు. అయితే ఆమె చెన్నైలో మరొకరిని ప్రేహించిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో అంగరంగ వైభవంగా వివాహ ఏర్పాట్లు చేశారు. రాత్రికి రిసెప్షన్.. ఉదయాన్నే వివాహం కావడంతో వరుడు, వధువు తరఫు బంధువులు భారీగానే హాజరయ్యారు. రాత్రి రిసెప్షన్ బ్రహ్మాండంగా జరగడంతో అంతా ఉదయాన్నే పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో అర్ధరాత్రి వేళ పోలీసులు కల్యాణ మండపానికి రావడంతో కథ అడ్డం తిరిగింది. వధువు ప్రియుడు తన ప్రియురాలికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారంటూ చెన్నై పోలీసులు.. అక్కడి నుంచి వచ్చి కడప పోలీసులకి ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులకి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కల్యాణ మండపానికి వెళ్లడంతో వధువు ట్విస్ట్ ఇచ్చింది. Read Also: తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. తాను మరొకరిని ప్రేమించానని చెప్పడంతో అంతా షాక్‌కి గురయ్యారు. పందిట్లో పెళ్లి ఆగిపోతోందని యువతికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని వధువు తేల్చిచెప్పింది. తాను ప్రియుడితోనే వెళ్లిపోతానని స్పష్టం చేయడంతో చేసేది లేక వధువు, ఆమె కుటుంబ సభ్యులను తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు. వారి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. ఈలోగా ఆమె ప్రియుడు అక్కడికి చేరుకోవడంతో అందరినీ కడపకు పంపించారు. Also Read:


By November 21, 2020 at 10:49AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bride-twist-before-marriage-goes-with-boyfriend-in-chittoor/articleshow/79335249.cms

No comments