Breaking News

బొగ్గు గనుల్లో బయటపడ్డ వజ్రాలు.. ఎగబడుతోన్న జనం.. రంగంలోకి దిగిన ప్రభుత్వం


నాగాలాండ్‌ బయటపడినట్లు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. మోన్‌ జిల్లా కేంద్రానికి శివారు గ్రామమైన వాంచింగ్‌ వద్ద ఉన్న బొగ్గు గనిలో తవ్వకాలు సాగుతుండగా నవంబరు 25న విలువైన ఖనిజాలు బయటపడ్డాయి. అవి మెరుస్తుండటంతో వజ్రాలేనంటూ సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను విస్తృతంగా షేర్‌ చేశారు. అయితే, వీటిని ధ్రువీకరించడానికి దర్యాప్తు జరిపి, నివేదిక సమర్పించాలని నాగాలాండ్‌ ప్రభుత్వం సంబంధిత అధికారులను శుక్రవారం ఆదేశించింది. నాగాలాండ్‌లో వజ్రాల వంటి విలువైన ఖనిజాలు ఉండే అవకాశముందని గతంలో భూగర్భ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెల్లడయింది. వాంచింగ్ గనుల వద్ద నాణ్యమైన బొగ్గు లభిస్తుంది. బొగ్గు తవ్వకాలు జరుగుతుండగా ఓ గ్రామస్థుడికి వజ్రంలా మెరిసిపోతున్న రాళ్లు లభించాయి. అవి వజ్రాలేనంటూ ప్రచారం జరిగడంతో చుట్టుపక్కల ఉండే వజ్రాల వేటగాళ్లు అక్కడ వాలిపోయారు. ఆ గ్రామం చుట్టుపక్కల తవ్వకాలు మొదలెట్టినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇవి వజ్రాలు లేక క్వార్టజ్ శిలలా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. వజ్రాల్లా మెరిసిపోతున్న నాలుగు నుంచి ఐదు రాళ్లు లభించడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారని, తర్వాత తవ్వకాలు మొదలెట్టారని మోన్ జిల్లా కలెక్టర్ థవాశీలన్ తెలిపారు. ఈ రాళ్లు భూమి ఉపరితలంపైనే లభించడంతో అవి వజ్రాలయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. వచ్చే వారం భూగర్భ గనుల శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. వాంచింగ్ గ్రామ సర్పంచ్ టోనైయ్ అనఘ్ మాట్లాడుతూ.. ఇవి వజ్రాలయి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. గ్రామస్థుడికి దొరికిన రాళ్లను సుత్తితో పగలుగొడితే ముక్కలైపోయాయని అన్నారు. వాస్తవానికి వజ్రాలు సుత్తితో కొట్టినా పగలవని వ్యాఖ్యానించాడు. చుట్టుపక్కల గ్రామాల వాళ్లే కాదు ఆర్మీ, అసోం రైఫిల్స్ సైనికులకు కూడా ఆ ప్రాంతానికి వస్తున్నారన్నాడు.


By November 28, 2020 at 07:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/diamond-rush-in-nagalands-coal-heartland-viral-on-social-media/articleshow/79457199.cms

No comments