ఒంగోలు క్వారంటైన్‌లో దారుణం.. భవనం పైనుంచి దూకేసిన మహిళ

ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్వారంటైన్ సెంటర్ భవనం పైనుంచి దూకేసి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కరోనా సోకిన మహిళ, ఆమె భర్తను ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. క్వారంటైన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న మహిళ సడెన్‌గా ఆత్మహత్య చేసుకుంది. కళాశాల భవనం పై నుంచి అమాంతం దూకేసి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె భర్త కూడా అదే క్వారంటైన్ సెంటర్‌లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన కారణాలు తెలియాల్సి ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు. కరోనా భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: మరోవైపు ఏపీలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో చాలా మందిని హోమ్ క్వారంటైన్ లోనే ఉంచుతున్నారు. హోమ్ క్వారంటైన్ లో ఉండేందుకు అవకాశం లేని వ్యక్తులను ప్రభుత్వం నిర్వహిస్తున్న క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. Read Also:
By September 11, 2020 at 12:21PM
No comments