Breaking News

గాలి ద్వారా కరోనా.. రెండు మీటర్ల దూరం వరకు వ్యాప్తి: చైనాా అధ్యయనం


తొలిసారి గతేడాది డిసెంబరు చివరిలో మొదలైన మొత్తం ప్రపంచాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. మహమ్మారి దాడి మొదలై 9 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ దీని వ్యాప్తికి సంబంధించిన కారణాలపై పరిశోధకులకు స్పష్టత రావడం లేదు. మొదట్లో గాలి ద్వారా వ్యాపించే ప్రమాదం లేదన్న పరిశోధకులు ఆ తర్వాత తమ అభిప్రాయం మార్చుకున్నారు. తాజాగా గాలి ద్వారా రెండు మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తికి కూడా ఈ వైరస్‌ సోకే ప్రమాదముందని ఓ అధ్యయనంలో తేలింది. జామా (జేఏఎంఏ) ఇంటన్నేషనల్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. కరోనా బాధితుడితో ప్రత్యక్షంగా కాంటాక్ట్‌ లేకపోయినా గాలి ద్వారా వైరస్‌ రెండు మీటర్ల దూరంలో ఉన్న ఆరోగ్యవంతుడికి కూడా సోకే ప్రమాదముంది. ఈ ఏడాది జనవరిలో చైనాలో లక్షణాలు కనిపించని ఓ కరోనా రోగి ద్వారా 24 మందికి ఇదే విధంగా కోవిడ్ సంక్రమించింది. కోవిడ్-19 రోగి బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో.. అతడికి రెండు మీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా గాలి ద్వారా వైరస్‌ సోకింది. వైరస్‌ తొలినాళ్లలో ఇది జరగడంతో.. అప్పటికి మాస్క్ తప్పనిసరి నిబంధన అక్కడ లేదు. కాగా, కరోనాపై ఒక్కో అధ్యయనంలో ఒక్కో కొత్త విషయం బయటపడుతూనే ఉంది. తూర్పు చైనాలోని యుద్ధ నౌక కార్యక్రమంలో పాల్గొనేందుకు 128 మంది రెండు బస్సుల్లో వెళ్లారు. ఓ బస్సులో కోవిడ్-19 రోగితో ప్రయాణించిన వారికి వేరే బస్సులో ప్రయాణించిన వారితో పోలిస్తే వైరస్ వ్యాప్తి ముప్పు ఎక్కువగా ఉందని తేలింది. జెజియాంగ్ ప్రావిన్స్‌లో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తిని పరిశోధకులు పరిశీలించారు. జనవరి 19న యుద్ధ నౌక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన 128 మందిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. వీరిలో 113 మంది మహిళలు, 15 మంది పురుషులు ఉన్నారు. వీరి సగటు వయసు 58.6 ఏళ్లు. అయితే, కోవిడ్ రోగి ప్రయాణించిన బస్సులో 68 మందిలో 24 మందికి వైరస్ సోకింది. మరో బస్సులో ప్రయాణించిన 60 మందిలో ఎవరికీ వైరస్ సోకలేదు. అదే కార్యక్రమానికి హాజరైన మరో 172 మందిలో ఏడుగురికి వైరస్ సోకింది. కోవిడ్ బాధితులు ప్రయాణించి బస్సులోని వ్యక్తులకు మరో బస్సులో ఉన్న వారితో పోలిస్తే వైరస్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది.


By September 04, 2020 at 07:03AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/community-outbreak-investigation-reveals-covid-19-transmission-through-air-from-2-meters/articleshow/77922445.cms

No comments