Breaking News

పెళ్లి కాని మహిళకు యువకుడి వల.. ఏడాదిగా లైంగికంగా దోచుకుంటూ


పెళ్లి చేసుకుంటానని నమ్మించి 19ఏళ్ల యువకుడు తన కంటే 13ఏళ్ల పెద్దదైన మహిళను లైంగికంగా దోచుకున్న ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట ప్రాంతానికి చెందిన మహిళ(32) ఇంకా వివాహం కాలేదు. కుటుంబసభ్యులు ఎన్ని సంబంధాలు చూసినా కుదరడం లేదు. దీంతో తనకు పెళ్లి కావడం లేదని ఆమె మనోవేదన చెందుతూ ఉండేది. ఆమె బలహీనతను అవకాశంగా తీసుకున్న అదే ప్రాంతానికి చెందిన యువకుడు(19) ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. Also Read: ఇద్దరి మధ్య 13ఏళ్లు వయసు బేధం ఉన్నప్పటికీ తాను పెళ్లి చేసుకుంటానని ఆ యువకుడు బాధితురాలిని నమ్మించాడు. ఆమె తన మాయలో పూర్తిగా పడిందని గ్రహించిన యువకుడు ఏడాదిగా ఆమెతో శారీరక వాంఛలు తీర్చుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇటీవల ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. నాకంటే పెద్దదానివి, నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నావంటూ ప్లేటు ఫిరాయించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By September 04, 2020 at 07:12AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/19-yr-old-man-rapes-several-times-on-32-yr-old-woman-in-hyderabad/articleshow/77922465.cms

No comments