నెల్లూరులో అమానుషం.. వ్యక్తి దారుణ హత్య


జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తిని దుండగులు కత్తితో కిరాతకంగా పొడిచి చంపేశారు. చిల్లకూరు మండలం కలవకకొండ గ్రామంలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన చేజర్ల సుబ్రహ్మణ్యం(38) ఈరోజు తెల్లవారు జామున దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
By September 27, 2020 at 11:34AM
No comments