Breaking News

Yesudas: కడసారి బాలును చూడలేకపోయా.. రావడానికి అనుమతి లేకపోవడంతో! ఏసుదాసు ఆవేదన


గాన గంధర్వుడు మరణం యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. దేశవిదేశాల్లోని అభిమానులకు, బాలు శిష్యులకు ఆయన మరణవార్త మింగుడుపడటం లేదు. మరోవైపు పలువురు సంగీత కళాకారులు, సినీ నటులు బాలు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కంటతడి పెడుతున్నారు. తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల ప్రముఖ గాయకుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ తీవ్ర ఆవేదన చెందారు. బాలు తనకు సొంత సోదరుడి కంటే ఎక్కువని, ఆయనతో కలిసి చాలా ఏళ్ళు ప్రయాణం చేశానని చెప్పిన ఏసుదాసు.. కరోనా నేపథ్యంలో అమెరికా నుంచి భారత్‌కు రావడానికి అనుమతి లేకపోవడంతో బాలును కడసారి చూసుకోలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాలు తన తన జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉంటారని చెప్పారు. తనతో పనిచేసిన వారందరి కంటే బాలుతోనే ఎక్కువ ప్రయాణం చేశానని, సంగీత ప్రపంచంలో బాలు మార్క్ చెరిపేయలేనిదని ఏసుదాసు అన్నారు. Also Read: సంగీతాన్ని సాంప్రదాయబద్దంగా నేర్చుకోకపోయినా ఈ రంగంలో ఎంతో నైపుణ్యాన్ని సాధించిన ఘనత బాలు సొంతమంటూ కొనియాడారు. ఓ సారి అమెరికా వెళ్ళినపుడు బాలు తమ బృందానికి వంట కూడా చేసి పెట్టారని, ఆయన్ను కోల్పోవడం చాలా బాధగా ఉందని తెలుపుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఏసుదాసు. బాలు- ఏసుదాసు మధ్య ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ఏసుదాసును గురువుగా భవిస్తూ ఆయనతో ఎంతో మర్యాదగా మెలిగేవారు బాలసుబ్రహ్మణ్యం.


By September 27, 2020 at 10:54AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/k-j-yesudas-tributes-to-s-p-balasubrahmanyam/articleshow/78344082.cms

No comments