భార్య, బిడ్డను పుట్టింటికి పంపి గుట్టుగా రెండో పెళ్లి... ముగ్గురిపై కేసు

అగ్ని సాక్షిగా తాళికట్టిన భర్త తనను మానసికంగా, శారీరకంగా వేధించడంతో పాటు గుట్టుగా రెండో పెళ్లి చేసుకున్నాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. భర్తతో పాటు అతడిని రెండో పెళ్లికి ఉసిగొల్పిన అత్తమామలపైనా చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన జిల్లా కల్లూరు మండలంలో వెలుగుచూసింది. Also Read: కల్లూరు మండలం బస్తిపాడుకు చెందిన పార్వతి అనే యువతికి దేవనకొండ మండలం బేతపల్లిలోని మేనమామ కుమారుడైన హరికృష్ణతో 2016 మార్చి 26న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఆరున్నర తులాల బంగారం, రూ.2 లక్షల నగదు కట్న కానుకల కింద అందజేశారు. ఆరు నెలల వరకు వీరి సంసారం సజావుగానే సాగింది. ఆ తర్వాతి నుంచి అదనపు కట్నం కోసం అత్తమామలు పార్వతిని వేధించడం మొదలుపెట్టారు. ఆమెకు ఆడబిడ్డకు జన్మనివ్వడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త ఆమెను పుట్టింటికి పంపేయడంతో రూ.లక్ష ఇచ్చి పంపించారు. Also Read: పాపతో పాటు పుట్టింటికి వెళ్లి కొద్దిరోజులు ఉండి రావాలంటూ పార్వతిని అత్తమామలు పంపించారు. ఈ సమయంలోనే తన భర్తకు పెద్దకడుబూరు మండలం హెచ్.మురవన గ్రామానికి చెందిన యువతితో రెండో పెళ్లి చేశారని పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన జీవితాన్ని నాశనం చేసిన భర్త, అత్తమామలపై కఠినచర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By September 04, 2020 at 08:09AM
No comments