Breaking News

శ్రీకాకుళం: భార్య ఎడబాటును తట్టుకోలేక మూడు రోజులకే భర్త ఆత్మహత్య


భార్య మృతిని తట్టుకోలేక మూడురోజుల వ్యవధిలోనే భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా ఎచ్చెర్ల మండలంలో జరిగింది. మండలంలోని తోటపాలెం పంచాయతీ పెయ్యలపేట గ్రామానికి చెందిన బోనెల హేమసుందరరావు (22) భార్య శిరీష ఈ నెల 2వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తమ బిడ్డ చావుకు ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులేనని ఆరోపిస్తూ శిరీష తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read: ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఆలస్యంగా పడుకున్న హేమసుందరరావు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మూత్రవిసర్జన కోసం లేచి మళ్లీ పడుకున్నాడు. శనివారం ఉదయం ఏడు గంటలు దాటినా నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉన్నాడు. శనివారం తన ఇంట్లో విషపు ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Also Read: హేమసుందరరావు, శిరీష ప్రేమించుకుని ఏడాదిన్నర కిందట పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఏడాదిన్నరకే మూడురోజుల వ్యవధిలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం రెండు కుటుంబాలలో విషాదం నింపింది. ప్రాణానికి ప్రాణమైన భార్య చావుకు తానే కారణమని అత్తమామలు కేసు పెట్టడాన్ని తట్టుకోలేకే హేమసుందరరావు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎచ్చెర్ల ఎస్సై జి.రాజేష్‌ కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read:


By September 06, 2020 at 08:37AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-commits-suicide-in-srikakulam-district/articleshow/77957137.cms

No comments