Breaking News

అద్దెకు తీసుకున్న 13 కార్లు అమ్మేసి జల్సాలు.. పోలీసులకు చిక్కిన కేటుగాడు


వ్యసనాలకు అలవాటైన యువకుడు డబ్బుల కోసం మోసాలకు తెరదీశాడు. కార్లను అద్దెకు తీసుకుని వాటిని వేరొకరికి అమ్మేసి ఆ సొమ్ముతో జల్సాలు చేసుకుంటున్నాడు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జిల్లా పోలీసులు నిందితుడికి చెక్ పెట్టారు. పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెనుగొండ సీఐ పి.సునీల్‌కుమార్‌ ఈ కేసు వివరాలు వెల్లడించారు. Also Read: వీరవాసరం మండలం నౌడూరుకు చెందిన మేడపాటి మురళి అనేక మంది నుంచి కార్లు అద్దెకు తీసుకునేవాడు. కొన్ని కార్లను రెండు, మూడు నెలలు వేరొకరికి అద్దెకు ఇస్తున్నట్లు యాజమానులకు నమ్మకం కల్పించేవాడు. తర్వాత వాటిని వేరొకరికి అమ్మేసేవాడు. కొనుగోలుదారుల నుంచి ఎక్కువ మొత్తంలో నగదు అడ్వాన్స్‌గా తీసుకుని అందులో కొంత కారు యాజమానికి ఇచ్చి మిగిలిన సొమ్ముతో జల్సా చేసేవాడు. ఇలా అనేక గ్రామాల్లోని కార్ల యాజమానులను మోసం చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. Also Read: దీనిపై బాధితుల ఫిర్యాదులతో పెనుమంట్ర, అత్తిలి, పాలకొల్లు, వీరవాసరం పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పక్కా సమాచారంతో మంగళవారం కారులో వెళ్తున్న మురళిని నత్తారామేశ్వరం వద్ద పెనుమంట్ర ఎస్సై ఎస్‌ఎన్‌వీవీ రమేష్‌ అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 1.05కోట్ల విలువైన 13 కార్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. Also Read:


By September 09, 2020 at 08:56AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/west-godavari-police-arrested-cheater-13-cars-seized/articleshow/78008812.cms

No comments