కొత్తగూడెం: పుట్టినరోజు నాడే యువతి ఆత్మహత్య.. విషాదంలో కుటుంబసభ్యులు

క్షణికావేశంలో ఓ యువతి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చిన్నతనంలోనే భర్తను కోల్పోయినా ధైర్యం కోల్పోకుండా ఇద్దరు పిల్లల జీవితాలను తీర్చిదిద్దేందుకు బ్రతుకు పోరాటం సాగిస్తున్న మహిళకు కడుపుకోతను మిగిల్చింది. తన పుట్టినరోజు నాడు తల్లి, అన్న శుభాకాంక్షలు చెప్పలేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భద్రాద్ర కొత్తగూడెం జిల్లాలో జరిగింది. కొత్తగూడెం తిలక్‌నగర్‌కు చెందిన ధనలక్ష్మి భర్త సుధీర్‌సింగ్ 11 ఏళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. Also Read: అప్పటి నుంచి కొడుకు మౌర్య రాహుల్, కుమార్తె మౌర్య నైనా(18)లకు అన్నీ తానై పెంచుతూ వస్తోంది. తల్లికి తోడుగా రాహుల్ సింగరేణి సంస్థలో డీఎల్‌ఆర్ (డైలీ లేబర్)గా కార్పెంటర్ విధులు నిర్వహిస్తూ వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం మౌర్య పుట్టినరోజు కావడంతో సర్‌ప్రైజ్‌గా చేద్దామని తల్లీ, అన్న ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఉదయం ఆమెకు విషెస్ కూడా చెప్పడంతో ఇద్దరూ తమ డ్యూటీలకు వెళ్లిపోయారు. దీంతో తల్లి, అన్న తనను పట్టించుకోలేదన్న మనస్తాపంతో మౌర్య లేఖ రాసిపెట్టి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. Also Read: సాయంత్రం ఇంటికొచ్చేసరికి మౌర్య విగతజీవిగా పడి ఉండటంతో తల్లి, అన్న షాకయ్యారు. ఘనంగా బర్త్‌డే పార్టీ చేద్దామని ప్లాన్ చేసుకుంటే జీవితంలో మరిచిపోలేని షాకిచ్చావంటూ మౌర్య మృతదేహం వద్ద కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కొత్తగూడెం టూటౌన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By September 09, 2020 at 08:28AM
No comments