పెళ్లయిన మూడు నెలలకే ఆటోడ్రైవర్ ఆత్మహత్య.. భార్య పుట్టింటి నుంచి వచ్చేలోపే

ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న యువకుడు మూడు నెలలకే ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విశాఖ నగరం వేపగుంట దరి అప్పన్నపాలెంలో జరిగింది. అప్పన్నపాలెంలో నివాసం ఉంటున్న కోర్న హరీశ్ (19) ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. అతడికి మే నెలలో శ్రీకాకుళం జిల్లాకు యువతితో వివాహం జరిగింది. ఆషాడ మాసం కావడంతో యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. హరీశ్ తల్లి అప్పయ్యమ్మ బుధవారం కోడలిని తీసుకువచ్చేందుకు శ్రీకాకుళం వెళ్లింది. Also Read: దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం ఉదయం హరీశ్ గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆషాదం పూర్తికావడంతో పుట్టింటి నుంచి ఎంతో సంతోషంగా మెట్టినింటికి బయలుదేరేందుకు సిద్ధమైన ఆ యువతి భర్త ఆత్మహత్య వార్త విని షాక్‌లోకి వెళ్లిపోయింది. ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో బంధువులే తోడుగా నిలిచి ఘనంగా వివాహం చేశారు. Also Read: ఇప్పుడు కట్టుకున్న భర్త కూడా దూరం కావడంతో ఆమె విలపిస్తున్న తీరు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. పెందుర్తి ఎస్‌ఐ రామవర్తి కేసు నమోదు చేసి.. హరీశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అతడి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. Also Read:
By August 13, 2020 at 07:50AM
No comments