ప్రియురాలితో జీడితోటలో రొమాన్స్... ఆమె భర్త కంటపడటంతో

వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. తన భార్యతో పెట్టుకున్నాడన్న కక్షతో మహిళ భర్త ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఈ ఘటన విశాఖ జిల్లా మండలంలో వెలుగుచూసింది. పరవాడ మండలం బండారుపాలెం నుంచి ముత్యాలమ్మపాలెం వెళ్లే మార్గంలోని తోటల్లో ధర్మరాజు అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. లోతుగా దర్యాప్తు చేయగా అతడి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. Also Read: పరవాడ మండలం నాయుడుపాలెం పంచాయతీ పరిధి హస్తినాపురం గ్రామానికి చెందిన ధర్మరాజు(40) అచ్యుతాపురంలోని ఒక కంపెనీలో కార్మికునిగా పనిచేసేవాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న ధర్మరాజు.. ముత్యాలమ్మపాలెం పంచాయతీ పరిధి దిబ్బపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటికి సారా తాగడానికి తరుచూ వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఆ మహిళతో చనువు ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ ఇద్దరు ముత్యాలమ్మపాలెం- బండారుపాలెం మధ్యలోని జీడిమామిడి తోటల్లో తరచూ శారీరకంగా కలుసుకునేవారు. Also Read: ఈ విషయం మహిళ భర్త కుళ్లయ్యకు తెలియడంతో ధర్మరాజుపై కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా చంపేయాలని ప్లాన్ వేశాడు. ఈ నెల 2న తన భార్య నగదు, సారాయి పట్టుకొని బయటకు వెళ్లడం కుళ్లయ్య గమనించాడు. సెల్‌ఫోన్ ఛార్జర్ పట్టుకుని చాటుగా ఆమెను వెంబడించాడు. జీడితోటలో ఇద్దరూ ఏకాంతంగా గడపడం చూసి ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో కుళ్లయ్యపై ధర్మరాజు ఎదురుతిరిగాడు. కోపోద్రిక్తుడైన కుళ్లయ్య సెల్‌ఫోన్ ఛార్జర్ వైరును ధర్మరాజు గొంతుకు బిగించి చంపేసి పరారయ్యాడు. Also Read: మరోవైపు తన భర్త కనిపించడం లేదంటూ ధర్మరాజు భార్య మూడో తేదీ పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసుల ఆరో తేదీన అతడి మృతదేహాన్ని గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. కుళ్లయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో అతడిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By August 12, 2020 at 09:00AM
No comments