అక్కకి సాయంగా వెళ్తే గర్భవతిని చేసిన బావ.. కృష్ణా జిల్లాలో దారుణం

అత్తింట్లో అక్కకు సాయం చేద్దామని వెళ్లిన బాలికపై కన్నేసిన బావ ఆమెను శారీరకంగా లొంగదీసుకుని గర్భవతిని చేసిన దారుణ ఘటన కృష్ణా జిల్లా మండలంలో జరిగింది. ఆగిరిపల్లి మండలం తాడేపల్లి చొప్పరమెట్లకు చెందిన ఒంగూరి ఇజ్రాయేలు ప్రస్తుతం వడ్లమానులో నివాసం ఉంటున్నారు. అతడికి కొంతకాలం క్రితం విజయవాడకు చెందిన యువతితో వివాహమైంది. Also Read: ఆమె ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో ఇంటి పనుల్లో సాయం చేసేందుకు చెల్లి అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో మరదలిపై కన్నేసిన ఇజ్రాయేలు ఆమెను మాయమాటలతో మభ్యపెట్టి శారీరకంగా లొంగదీసుకున్నాడు. భార్యకు తెలియకుండా ఆమెపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. Also Read: ఆమెను పరీక్షించిన డాక్టర్లు గర్భవతి అని నిర్ధారించడంతో అందరూ షాకయ్యారు. సాయం చేయడానికి పంపిస్తే ఇజ్రాయేలు తమ కూతురిని గర్భవతిని చేశాడని, న్యాయం చేయాలంటూ బాలిక తల్లిదండ్రులు ఈ నెల 21న పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆగిరిపల్లి పోలీసులు ఇజ్రాయేలుపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. సోమవారం అతడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. Also Read:
By August 25, 2020 at 08:15AM
No comments