Breaking News

139 మంది రేప్ కేసు సీసీఎస్‌కు బదిలీ.. ఆధారాలు దొరికేనా?


తనపై 139 మంది 5వేల సార్లు అత్యాచారానికి పాల్పడ్డారని నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని సోమవారం భరోసా కేంద్రానికి తరలించారు. అక్కడ వాంగ్మూలం సేకరించి ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తలనొప్పి వ్యవహారంగా తయారైన ఈ కేసును సీఐడీకి అప్పగించాలా? సీసీఎస్‌కు అప్పగించాలా? అన్న దానిపై పోలీసులు రెండ్రోజుల పాటు మల్లగుల్లాలు పడ్డారు. చివరికి సీసీఎస్‌కే బదిలీ చేస్తున్న సోమవారం ప్రకటించారు. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తూ అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. Also Read: ఇన్ని సంవత్సరాలు పాటు అంత మంది అత్యాచారం చేస్తూ వస్తున్నా ఆమె ఎందుకు బయటపడలేదు, పోలీస్‌స్టేషన్లలో ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న అనుమానం పోలీసులకు కలుగుతోంది. ఒకవేళ ఎక్కడైనా పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోతే మీడియా ముందుకు ఎందుకు రాలేదు? అన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. భరోసా సెంటర్లో పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన బాధితురాలు, మరికొన్నింటిని దాటవేసినట్లు తెలుస్తోంది. ‘ఎక్కడైనా ఫిర్యాదు చేస్తే నిన్ను చంపేస్తాం .. నీకు వెనుక ముందు ఎవరు లేరు’ అని చాలా మంది కాల్స్ చేసి బెదిరించారని బాధితురాలు చెప్పినట్లు సమాచారం. వారి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని, అందుకే మరణ వాంగ్మూలం కూడా రాసి పెట్టుకున్నట్లు వెల్లడించింది. Also Read: మరోవైపు ఆమె చేసిన ఆరోపణలకు పోలీసులు ఆధారాలు అడగ్గా తన వద్ద లేదని చెప్పింది. తనను ఏయే హోటల్‌కు ఎప్పుడెప్పుడు తీసుకెళ్లాలో మాత్రం గుర్తుందని, హోటళ్లలో సీసీటీవీ పుటేజీ పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని తెలిపింది. అయితే తొమ్మిదేళ్ల క్రితం నాటి పుటేజీ దొరకడం అసాధ్యమని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు తమపై బురద జల్లేందుకు వెనకాల ఎవరో ఉండి ఆమెతో ఆరోపణలు చేయిస్తున్నట్లు నిందితుల్లో కొందరు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆమెను జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. ఓ ఎన్జీవో సంస్థ బాధితురాలి వెనకాల ఉండి ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు వస్తున్న కథనాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. Also Read:


By August 25, 2020 at 07:42AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-woman-raped-by-139-men-case-transfer-to-ccs-police/articleshow/77732764.cms

No comments