Breaking News

సత్తెనపల్లి: మోజు తీరాక వదిలించుకున్న ప్రియుడు.. యువతి ఆత్మహత్య


ప్రేమ పేరుతో యువతిని శారీరకంగా లొంగదీసుకుని మోజు తీరాక మొహం చాటేశాడో యువకుడు. ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయిన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ కేసు తన మెడకు చుట్టుకుంటుందన్న ఆందోళనతో ప్రియుడు కూడా ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లా మండలంలో జరిగింది. నందిగామ గ్రామానికి చెందిన సయ్యద్‌ మహబూబ్బి(21), కొమెరపూడికి చెందిన షేక్‌ ఇస్మాయేలు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. Also Read: ఇస్మాయేలు నందిగామలోని మిర్చి కోల్డ్ స్టోరేజీలో పని చేస్తుండగా, మహబూబ్బి టీచర్ ట్రైనింగ్ కోర్సు తొలి ఏడాది పూర్తి చేసింది. ఈ క్రమంలోనే తరుచూ కలుసుకుంటూ శారీరకంగానూ దగ్గరయ్యారు. మహబూబ్బి పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ఇస్మాయేలు దాటవేస్తూ వస్తున్నాడు. ఈ నెల 17న ఆమె గట్టిగా నిలదీయగా పెళ్లి చేసుకోనని చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె పురుగులమందు తాగేసింది. కుటుంబసభ్యులు హుటాహుటిన సత్తెనపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. Also Read: ఈ విషయం తెలుసుకున్న ఇస్మాయేలు ఆమె చనిపోతే తాను జైలుకి వెళ్లాల్సి వస్తుందని భయపడి 20వ తేదీన పురుగులమందు తాగాడు. స్థానికులు అతడిని సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదివారం గుంటూరులోని సర్వజనాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మహబూబ్బి ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఇస్మాయేలు, అతని తండ్రి హుస్సేన్‌లపై సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By August 25, 2020 at 08:34AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-commits-suicide-in-guntur-district-over-boyfriend-cheating/articleshow/77733420.cms

No comments