Breaking News

రైతును చంపేసి పొలంలోనే పాతిపెట్టి.. ఆస్తి కోసం బంధువుల ఘాతుకం?


జిల్లాలో రైతు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. దేవరపల్లి మండలం చిన్నాయగూడెంకు చెందిన రైతు గడా భాస్కరరావు (55)ను దుండగులు చంపేసి ఆయన పొలంలోనే పాతిపెట్టారు. భాస్కరరావు నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదు. ఈ క్రమంలోనే సోమవారం పుట్టగొడుగుల కోసం వెళ్లిన వారు అసంపూర్తిగా పూడ్చిపెట్టిన శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు పొలానికి చేరుకుని పరిశీలించారు. Also Read: మంగళవారం మృతదేహాన్ని బయటకు తీయించి అక్కడే శవపంచనామా, పోస్టుమార్టం చేయించారు. ఈ ఘటనపై తొలుగ మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం హత్య కేసుగా మార్పు చేశారు. భాస్కరరావు దంపతులకు పిల్లలు లేరు. ఇటీవలే ఆయన భార్య చనిపోయారు. దీంతో ఆసరా కోసం రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. Also Read: ఈ క్రమంలోనే ఆస్తి వేరే వారికి పోతుందన్న కక్షతో బంధువులెవరైనా ఆయన్ని హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గ్రామంలో జరిగిన ఈ హత్య తీవ్ర కలకలం రేపింది. Also Read:


By August 12, 2020 at 10:49AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/farmer-brutally-murdered-in-west-godavari-district-police-suspects-property-disputes/articleshow/77498187.cms

No comments