ఆదిలాబాద్: కామంతో కళ్లు మూసుకుపోయి 8ఏళ్ల బాలికపై అత్యాచారం

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జిల్లా జైనథ్ మండలంలో ఆదివారం జరిగింది. మండలంలోని నిరాల గ్రామానికి చెందిన ఆకాశ్(21) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం గ్రామంలోని ఓ ఇంటి ముందుకు బాలిక(8) ఒంటరిగా ఆడుకుంటుండటాన్ని గమనించాడు. ఆమెతో మాటలు కలిపి తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. Also Read: కాసేపటి తర్వాత ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిన బాలికను తల్లిదండ్రులు ఏం జరిగిందని నిలదీశారు. కడుపులో నొప్పిగా ఉందని చెబుతూనే తనపై జరిగిన దారుణాన్ని వివరించింది. దీంతో తల్లిదండ్రులు సోమవారం జైనథ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఘటనపై వివరాలు సేకరించిన పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆకాష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. Also Read:
By August 25, 2020 at 10:43AM
No comments