విదేశీ మహిళపై స్వామీజీ అఘాయిత్యం.. తమిళనాడులో దారుణం

తమిళనాడులో దారుణ ఘటన వెలుగుచూసింది. తిరువణ్ణామలైలో నివాసం ఉంటున్న అమెరికా మహిళపై ఓ స్వామీజీ అత్యాచారానికి యత్నించాడు. ఆ కీచకుడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బాధితురాలు అతడిపై కత్తితో దాడి చేసింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కీచక స్వామీజీకి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. Also Read: అమెరికాకు చెందిన ఓ మహిళ(31) ఐదు నెలల క్రితం తిరువణ్ణామలైలోని ఆలయాలను చూడటానికి వచ్చింది. లాక్‌డౌన్ కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో తిరువణ్ణామలైలోని అరుణాచలనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటోంది. ఈ ప్రాంతంలో స్వామీజీలు, సాధువులు ఎక్కువగా ఉంటారు. దీంతో ఆమె రోజూ ఆశ్రమాలు సందర్శిస్తూ కాలక్షేపం చేసేది. ఈ క్రమంలోనే ఆమెకు నామకల్ జిల్లా తిరుమలై పట్టి గ్రామానికి చెందిన మణిగండన్(41) అనే స్వామీజీ పరిచయమయ్యాడు. Also Read: ఆమె చెప్పే విషయాలు వినడానికి అమెరికా మహిళ రోజూ అతడి వద్దకు వెళ్లేది. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్న స్వామీజీలో కామవాంఛలు పెరిగాయి. ఆదివారం ఉదయం ఆమె ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. కోరిక తీర్చాలంటూ అత్యాచారానికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేస్తూనే కత్తితో అతడిపై దాడి చేసింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మణిగండన్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. Also Read:
By August 25, 2020 at 11:02AM
No comments