Breaking News

Anushka: లైంగిక దోపిడీ చేయాలని చూశారు.. అలా తప్పించుకున్నా! కాస్టింగ్ కౌచ్‌పై అనుష్క కామెంట్స్


సినీ ఇండస్ట్రీకి పట్టిన భూతం కాస్టింగ్ కౌచ్. తమ తమ సినిమాల్లో అవకాశం ఇస్తాం.. కానీ మాకేంటి? అంటూ మహిళలను డైరెక్టుగా అడిగే బ్యాచులు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయంటూ ఇప్పటికే ఎందరో హీరోయిన్స్ ఓపెన్‌గా చెప్పేశారు. ‘‘మీటూ, కాస్టింగ్ కౌచ్’’ లాంటి ఉద్యమాలు లేవనెత్తి ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడి, చీకటి కోణాలను బయటపెట్టారు. దీంతో ప్రతి ఇంటర్వ్యూలోనూ హీరోయిన్లకు కాస్టింగ్ కౌచ్‌పై మీ అభిప్రాయం ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ హీరోయిన్ దీనిపై స్పందించింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనుష్క.. తన కెరీర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న అనుభవాలను చెప్పింది. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని, ఇందులో దాచేదేమీ లేదని చెప్పుకొచ్చింది. తాను కూడా కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు పడ్డానని, కెరీర్ ఆరంభంలో అలాంటి కొన్ని అనుభవాలు ఎదురుకాగా.. ధైర్యంగా, ముక్కుసూటిగా ఉండటం వల్ల కాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకోగలిగానని అనుష్క తెలిపింది. అయితే ఇప్పటిదాకా తనతో ఎవ్వరూ మిస్ బిహేవ్ చేయలేదని చెబుతూ, ఈ ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఆడవాళ్ళకి వేధింపులు తప్పడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అనుష్క. Also Read: ఈ మధ్యకాలంలో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన అనుష్క.. ప్రస్తుతం 'నిశ్శబ్దం' సినిమాలో నటిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఇంగ్లీష్‌లో సైలెన్స్ అనే టైటిల్స్ ఫిక్స్ చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించారు. మాధవన్, షాలిని పాండే తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


By August 25, 2020 at 11:14AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anushka-open-comments-on-casting-couch-in-tollywood/articleshow/77735579.cms

No comments