బైక్ దొంగలు దొరికారు.. 77 వాహనాలు స్వాధీనం, 15 మంది అరెస్ట్

వాళ్ల కన్నుపడితే ఏ బైక్ అయినా మాయం కావాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వందల సంఖ్యలో బైకులు చోరీ చేస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇలా హైదరాబాద్‌లో బైకులను చోరీచేస్తూ నిజామాబాద్‌లో విక్రయిస్తున్న మూడు ముఠాలను నార్త్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఏకంగా రూ.1.25కోట్ల విలువైన 77 బైకులు స్వాధీనం చేసుకున్నారు. Also Read: హైదరాబాద్‌లోని పాతబస్తీ, సికింద్రాబాద్ ప్రాంతాలకు చెందిన మొహిసిన్, అమీనుల్లా ముఠాలు కొన్నేళ్లుగా బైక్ చోరీలు చేస్తున్నాయి. వీరికి నిజామాబాద్‌కు చెందిన అక్బర్, అస్గర్ ముఠాతో పరిచయం ఏర్పడింది. బైక్‌కు రూ.15-20 వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడంతో వీరు హైదరాబాద్‌లో చోరీలు చేసి హిందుస్థాన్ పార్సిల్ సర్వీస్ ద్వారా నిజామాబాద్‌కు పంపేవారు. ఇలా ఆరు నెలల్లో సుమారు 150 బైకులను పంపించారు. ఇటీవల ఓ బైక్ కేసును దర్యాప్తు చేస్తున్నా కార్ఖానా పోలీసులు సీసీటీవీ పుటేజీ పరిశీలించగా పాత నేరస్థుడు మొహిసిన్ కనిపించాడు. దీంతో నిఘా పెట్టిన పోలీసులు అతడితో పాటు మహ్మద్ ఆదిల్, అహ్మద్, సైఫ్, ఒవైస్, మహ్మద్ గౌస్, హసన్ బిన్‌లను అరెస్ట్ చేసి 15 బైకులను స్వాధీనం చేసుకున్నారు. Also Read: వాహనాలను అఫ్జల్‌గంజ్‌లోని హిందుస్థాన్ పార్సిల్ సర్వీస్ ద్వారా నిజామాబాద్ పంపుతున్నట్లు నిందితులు చెప్పారు. దీంతో ఆ పార్సిల్ సర్వీస్ మేనేజర్ నుంచి సమాచారం సేకరించిన పోలీసులు అమీనుల్లా, షేక్ అబూద్, మహ్మద్ నవీదుద్దీన్, అస్గర్‌ఖాన్, ఫరూక్, అబ్బు, సైఫ్ అహ్మద్‌లను అరెస్ట్ చేసి 21 బైకులను, నిజామాబాద్‌లో అస్గర్, రిజ్వాన్‌లను అరెస్ట్ చేసి మరో 41 బైకులను స్వాధీనం చేసుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్క బైక్ చోరీ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఏకంగా 77 బైకులను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది Also Read:
By August 06, 2020 at 11:08AM
No comments