Rashi Khanna: రష్మిక ఛాలెంజ్ ఫినిష్ చేసిన రాశిఖన్నా.. ఆ ముగ్గురు యంగ్ హీరోయిన్లకు సవాల్
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ విసిరిన ఫినిష్ చేసింది హీరోయిన్ . రష్మిక సవాల్ స్వీకరించిన ఈ బ్యూటీ.. షేక్‌పేటలోని తన ఇంట్లోనే మూడు మొక్కలు నాటింది. ఈ మేరకు మరో ముగ్గురు యంగ్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, తమన్నాలను నామినేట్ చేసింది. తాను మొక్కలు నాటుతున్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ భాగమై ఈ చైన్ ఇలాగే కొనసాగించాలని పేర్కొంది. మొక్కలు నాటిన అనంతరం రాశి ఖన్నా మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని కొనియాడింది. రోజు రోజుకూ పెరిగిపోతున్న కాలుష్య నియంత్రణలో, పర్యావరణ సమత్యులత కాపాడటంలో మొక్కలు నాటడం చాలా ముఖ్యమని, భవిష్యత్ తరాలకు ఈ బృహత్తర కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందని తెలిపింది. Also Read: ప్రస్తుతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన వస్తుండటం విశేషం. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగమవుతున్నారు. పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు ఎవరికి వారు పెద్దఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ భావితరాలకు మెరుగైన వాతావరణం ప్రసాదించడంలో అంతా భాగం కావాలని పిలుపునిస్తున్నారు.
By July 21, 2020 at 10:52AM
No comments