కర్నూలు: భర్తను చంపేసి యాక్సిడెంట్ నాటకం.. ప్రియుడితో కలిసి ఘాతుకం
ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన నగరంలో వెలుగుచూసింది. కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన కాశపోగు తిమ్మరాజు (40)ను భార్యే ప్రియుడితో కలిసి దారుణంగా చంపేసింది. అనంతరం రోడ్డుప్రమాదంలో తన భర్త చనిపోయాడంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. వీధుల్లో తిరుగుతూ ఐస్‌క్రీమ్ విక్రయించే తిమ్మరాజు భార్య అంజనమ్మ, ముగ్గురు పిల్లలతో కలిసి వీకర్ సెక్షన్ కాలనీలో ఉంటున్నాడు. ఓ సంస్థలో స్వీపర్‌గా పనిచేసే అంజనమ్మ అక్కడ ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. Also Read: ఈ విషయం తెలుసుకున్న తిమ్మరాజు భార్యను పని మాన్పించేశాడు. దీనిపై దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను కడతేర్చాలని అంజనమ్మ నిర్ణయించుకుంది. ఆదివారం రాత్రి తన ఆరోగ్యం సరిగా లేదని, ఆసుపత్రికి వెళ్దామంటూ భర్తను బయటకు తీసుకెళ్లింది. అర్ధరాత్రి తర్వాత భర్తను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి ఆటోలో నుంచి కింద పడిపోయినట్లు చెప్పింది. తిమ్మరాజును పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. అయితే అతడి మెడచుట్టూ ఉన్న గాయం అనుమానాస్పదంగా ఉండటంతో డాక్టర్లకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: దీంతో పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని తిమ్మరాజు మృతదేహాన్ని పరిశీలించారు. మెడపై గాయాన్ని బట్టి హత్యగా నిర్ధారణకు వచ్చారు. దీంతో పోలీసులు అంజనమ్మను విచారించగా ప్రియుడితో కలిసి తానే భర్తను గొంతు నులిమి చంపేసినట్లు అంగీకరించింది. తిమ్మరాజు చెల్లెలు లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో అంజనమ్మ, ఆమె ప్రియుడు కాకుంగా ఇతరులెవరి హస్తముందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By July 21, 2020 at 10:49AM
No comments