గాలి ద్వారా కరోనా వ్యాప్తి.. సీఎస్ఐఆర్ కీలక సూచన
గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై భారత్‌లోని అత్యున్నత ఆర్ అండ్ డీ సంస్థ చీఫ్ శేఖర్ సి మండే కీలక వివరాలను వెల్లడించారు. బయటకు వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా.. ఆఫీసుల్లాంటి (Enclosed Areas) ప్రాంతాల్లోనూ మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోకి వెళ్లొద్దని.. పని ప్రదేశాల్లాంటి చోట గాలి వెలుతురు సరిపడా వచ్చేలా చూసుకోవాలని ఆయన సూచించారు. ‘‘కరోనా కట్టడి కోసం మాస్కులు ధరించడమే చక్కటి వ్యూహమని సీఎస్ఐఆర్ చీఫ్ తెలిపారు. కరోనా సోకిన వారు దగ్గినా లేదా తుమ్మినా పెద్ద తుంపర్లు ఉపరితలం మీద పడతాయి. కానీ చిన్న తుంపర్లు మాత్రం ఎక్కువ సేపు గాల్లోనే ఉండిపోతాయి. కాబట్టి వీటి వల్ల గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది’’ అని సీఎస్ఐఆర్ చీఫ్ తెలిపారు. కరోనా గాలి ద్వారా వ్యాపించే అవకాశం ఉందని ప్రపంచ దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు. గాల్లో వైరస్ చాలా సేపు ఉంటుందని.. అది చాలా దూరం ప్రయాణిస్తుందని వారు డబ్ల్యూహెచ్‌వోకు తెలిపారు. గాలి పీల్చినప్పుడు అందులో ఉన్న వైరస్ మరో వ్యక్తిలోకి ప్రవేశిస్తుందన్నారు.
By July 21, 2020 at 11:00AM
No comments