అఫైర్‌కు అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్తపై గొంతుకోసి..
అక్రమ సంబంధాలు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో పడుతున్న కొందరు జీవిత భాగస్వాముల ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదు. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కక్షతో ఓ వ్యక్తి ప్రియురాలి భర్తపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. . ఈనెల 10న కొడావత్ రాజు అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి మండలంలోని నల్లమెట్టు అటవీ శివారు ప్రాంతంలో వదిలేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కేసును ఐదు రోజుల్లోనే చేధించి నిందితులను అరెస్ట్ చేశారు. Also Read: ఫరూక్‌నగర్ మండలం వెంకన్నగూడెంకు చెందిన కొడావత్ రాజు రెండేళ్ల క్రితం భార్య శాంతి, పిల్లలతో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. బండ్లగూడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే శాంతికి ఫంక్షన్ హాల్ యజమాని యూసుఫ్‌తో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. ఏడాది కాలంగా వీరి మధ్య అనైతిక సంబంధం కొనసాగుతోంది. అయితే ఈ విషయం రాజుకు తెలిస్తే తమ సుఖానికి అడ్డుపడతాడని ఆందోళణ చెందిన వారు అతడికి అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. అందుకోసం శాంతి అన్న శ్రీను, యూసూప్ చిన్నాయన జహీరుద్దీన్ సహకారం తీసుకున్నారు. నలుగురు కలిసి రాజు హత్యకు పక్కా ప్లాన్ వేశారు. Also Read: ఈ నెల 10న బయటకు వెళ్దామని చెప్పి యూసుఫ్, శ్రీను, జహీరుద్దీన్, శాంతి కలిసి రాజును కారులో తీసుకెళ్లారు. మార్గమధ్యలో అతడికి మద్యం తాగించారు. రాత్రి 9 గంటల సమయంలో తలకొండపల్లి మండలం నల్లమెట్టు అటవీ ప్రాంతానికి చేరుకోగా రాజు మూత్ర విసర్జన కోసం కారు దిగాడు. అదే సమయంలో నలుగురు కలిసి రాజును పొదల్లోకి లాక్కెళ్లి గొంతు కోశారు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో చనిపోయాడని భావించి అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం తేరుకున్న రాజు శరీరమంతా రక్తంతా నడుచుకుంటూ సమీపంలోని రోడ్డుపైకి చేరుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాధితుడిని హైదరాబాద్‌లోని ఈఎన్‌టీ హాస్పిటల్‌కు తరలించారు. బాధితుడు చెప్పిన వివరాల ఆధారంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు Also Read:
By July 16, 2020 at 11:11AM
No comments