భార్య మరణాన్ని తట్టుకోలేక భర్మ ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న ఫేస్‌బుక్ ఫోస్ట్
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయిన వ్యక్తి తాను కూడా బలవన్మరణానికి పాల్పడిన ఘటన తమిళనాడులో విషాదం నింపింది. చెన్నైకి సమీపంలోని తిరువొత్తియూరు దిలీపన్ నగర్‌కు చెందిన అరవింద రాజా (26) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన పవిత్ర(24) అనే యువతిని ప్రేమించి 2016లో వివాహం చేసుకున్నాడు. పెళ్లయి నాలుగేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. Also Read: కొద్దిరోజుల క్రితం భర్తతో గొడవ జరగడంతో పవిత్ర పట్టాభిరామంలోని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి డిప్రెషన్‌లో ఉన్న ఆమె ఈ నెల 15వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణవార్త విని అరవింద రాజా తట్టుకోలేకపోయాడు. సోమవారం తన ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అతడు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న పవిత్ర లేని ఈ లోకంలో తానూ ఉండలేకపోతున్నానని’ పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. Also Read:
By July 22, 2020 at 08:49AM
No comments