బ్రేకింగ్: ‘పవర్ స్టార్’ ట్రైలర్ లీక్.. ఒక్క సీటు కూడా రాలేదని ఏడుస్తున్న పవర్ స్టార్
వెన్నుపోటు అంశాన్ని తన సినిమాల్లో ఎక్కువగా ప్రస్తావించే వర్మనే వెన్నుపోటు పొడిచారు ఆయన దగ్గర పనిచేసే సిబ్బంది. ‘పవర్ స్టార్’ సినిమాలతో ప్రకంపనలు రేపుతున్న వర్మ.. ఈ మూవీ ట్రైలర్‌ను జూలై 22 ఉదయం 11 గంటలకు rgv world theatre comలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫస్ట్ వరల్డ్ పెయిడ్ ట్రైలర్‌గా విడుదలౌతున్న ఈ ట్రైలర్‌ను చూడాలంటే రూ.25 చెల్లించాలని వర్మ రేటు ఫిక్స్ చేశారు. అయితే ఇప్పటికే చాలామంది ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకున్నారు. ఈ తరుణంలో వర్మకి షాక్ ఇస్తూ.. ‘పవర్ స్టార్’ ట్రైలర్‌ను ఆన్ లైన్‌లో విడుదల చేశారు ఆయన సిబ్బంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. ‘ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల కావాల్సిన పవర్ స్టార్ ట్రైలర్ లీక్ అయ్యింది. ఇది మా సొంత కార్యాలయ సిబ్బందిలో ఒకరు చేసిన పనిగా అనుమానిస్తున్నాము. మేము పూర్తి భాధ్యత వహిస్తూ చర్యలు తీసుకుంటాము.. ట్రైలర్ కోసం అడ్వాన్స్ బుక్కింగ్ చేసుకున్న వాళ్ల డబ్బులు తిరిగి ఇవ్వబడతాయి’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. అయితే ఇది కూడా వర్మ స్ట్రాటజీనే.. యూట్యూబ్‌లో ట్రైలర్ కోసం డబ్బులు అంటే ఎవరూ చూసేవాడు లేక ఇప్పుడు లీక్ అంటూ కొత్త ప్రమోషన్ డ్రామాలు మొదలుపెట్టాడంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. Read Also: Video Courtesy Greatandhra..
By July 22, 2020 at 08:44AM
No comments