Breaking News

బీజేపీకి ఓటేస్తే రూ.35 కోట్ల చెప్పారని ఆరోపణ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే‌కు సచిన్ లీగన్ నోటీసు


రాజస్థాన్ ప్రభుత్వంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కొనసాగుతుండగా.. అసమ్మతి నేత సచిన్ పైలట్‌‌ను టార్గెట్ చేస్తూ సీఎం ఎదురుదాడి ప్రారంభించారు. ఇక, రాజ్యసభ ఎన్నికల సందర్భంగా బీజేపీలో చేరితో రూ. 35 కోట్లు ఇస్తామని తనకు పైలట్ ఆశచూపారని కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగ్ చేసిన ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన .. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆ ఎమ్మెల్యేకు లీగల్ నోటీసులు పంపారు. తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారని సచిన్ పంపిన నోటీసులో పేర్కొన్నారు. ఆయన ఆరోపణలు తనను విస్మయానికి గురిచేశాయని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను సచిన్ పైలట్‌తో మాట్లాడానని, ఈ సందర్భంగా ‘నువ్వెంత ఆశిస్తున్నావ్?’ అని అడిగారని అన్నారు. ఆ వెంటనే రూ. 35 కోట్లు అంటూ ఆఫర్ చేశారని పేర్కొన్నారు. అయితే, ఆయన ఆఫర్‌ను తాను తిరస్కరించానని, విషయాన్ని సీఎం గెహ్లాట్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఈ వ్యవహారం డిసెంబరు నుంచి సాగుతోందని, ఇప్పుడే కాదని ఆరోపించారు. పైలట్‌తో రెండు మూడు సార్లు మాట్లాడానని అన్నారు. ఎమ్మెల్యే ఆరోపణలు ఒక్కసారిగా కలకలం రేపాయి. మలింగ్ తనపై ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన పైలట్.. దీనిపై విచారణ వ్యక్తం చేశారు. ‘నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తున్నందుకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. నా ప్రతిష్ఠకు భంగం కలిగించడానికి ఇలాంటి మరిన్ని ఆరోపణలు నాపై చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ నేను వాటిని పట్టించుకోను.. నాకు నాపై బలమైన నమ్మకం ఉంది’అని అన్నారు. ఇదిలా ఉండగా తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌ విషయంలో అధిష్ఠానం వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తోంది. పైలట్‌కు ఇప్పటికీ తలుపులు తెరిచే ఉన్నాయని, ఎలాంటి చర్యలు తీసుకోబోమని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. అటు, అనర్హత విషయంలో హైకోర్టులో ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. జులై 24 వరకు దీనిపై స్పీకర్ ముందుకెళ్లవద్దని సూచించింది.


By July 22, 2020 at 09:01AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rajasthan-crisis-sachin-pilot-sends-legal-notice-to-congress-mla-on-rs-35-crore-bribery-allegation/articleshow/77099486.cms

No comments