సింగరాయకొండ: మందుబాబుల సరదాకు అమాయకుడి బలి
ఇద్దరు యువకుల బైకు రేసింగ్ సరదా ఓ అమాయకుడి ప్రాణాన్ని బలి తీసుకున్న ప్రకాశం జిల్లా పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. సోమరాజుపల్లి పంచాయతీ ఆవులవారిపాలేనికి చెందిన సాయి, యెన్నం రమేష్ శనివారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించారు. ఆ మత్తులోనే ఇద్దరూ కలిసి బైక్ రేసింగ్ పందెం వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆవులవారిపాలెం నుంచి సోమరాజుపల్లి వైపు మత్తులో నిర్లక్ష్యంగా బైకులు నడుపుతూ ఎదురుగా వస్తున్న పొత్తూరి రామకృష్ణ (27) అనే యువకుడిని బలంగా ఢీకొట్టారు. Also Read: ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రామకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రామకృష్ణ సింగరాయకొండలోని సరస్వతీ కల్యాణ మండపం సమీపంలో నివాసముంటున్నారు. ఆవులవారిపాలెంలోని మిత్రుడిని కలిసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో సింగరాయకొండ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. రామకృష్ణ మృతదేహాన్ని 108 అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. సాయి, రమేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 20, 2020 at 08:35AM
No comments