Breaking News

వైద్య రంగానికి కొత్త సవాల్.. నడి సంద్రంలోని నౌకలో కరోనా!


కరోనా వైరస్‌కు సంబంధించి ఓ మిస్టరీ నౌక కేసు వైద్య రంగానికి సవాల్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలను కలవరానికి గురిచేస్తోన్న మిస్టరీని చేధిస్తే ఇప్పటి వరకు కరోనాపై ఉన్న సమాచారం స్వరూపం మారిపోవచ్చు. వైరస్‌ జీవితకాలం... ఇంక్యబేషన్‌ సమయం, క్వారంటైన్‌ ఎన్నాళ్లు ఉండాలి ఇవన్నీ మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది అర్జెంటీనాలో ‘ఉషుయా’నూ ‘ది ఎండ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ అని పిలుస్తారు. ఇక్కడ నుంచి ప్రజలు భారీ సంఖ్యలో చేపల వేటకు వెళుతుంటారు. జూన్‌ 6న మొత్తం 61 మంది నావికులతో కూడిన‘ఏచిజన్‌ మార్’ అనే ఓ నౌక చేపల వేటకు బయల్దేరింది. అన్ని సజావుగా సాగితే ఈ నౌక జులై 20న తిరిగి తీరానికి చేరాల్సి ఉంది. అయితే, నౌక సముద్రంలోకి వెళ్లిన కొద్ది రోజులకే అందులోని నావికులకు కొందరికి జలుబు, జ్వరం మొదలయ్యిది. క్రమంగా మిగతావారు కూడా అనారోగ్యానికి గురయ్యారు. చివరిగా వైద్య సిబ్బంది కూడా అనారోగ్యం బారిపడ్డారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో వేటకు వెళ్లిన 35 రోజుల తర్వాత జులై12న హడావుడిగా తీరానికి చేరింది. నౌకలోని 61 మందిలో 57 మంది నావికులు కరోనావైరస్‌ బారిన పడినట్లు తేలింది. ఈ నౌక సముద్రంలోకి వెళ్లడానికి ముందే సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు చేయగా వారికి నెగిటివ్‌ వచ్చింది. ఆ తర్వాత 14 రోజులు ఓ హోటల్‌లో నిర్బంధ క్వారంటైన్‌ చేసి, వీరు ఓడలోకి ఎక్కిన తర్వాత సామగ్రిని క్షుణ్ణంగా పరీక్షించారు. ఆ తర్వాతే నౌక ప్రయాణం మొదలైంది. సముద్రంలో ఉన్న 35 రోజుల ప్రయాణంలో కొత్త వ్యక్తులు లోపలికి రావడం కానీ, నౌకలో వారు ఎవరూ బయటకు పోలేదు. బయట నుంచి కొత్తగా సామగ్రి కూడా ఏమీ రాలేదు. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులు తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో నిర్దారణ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చి, క్వారంటైన్‌‌లో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు లేని వారి నుంచి వైరస్ ఎలా వ్యాపించింది? అనేది మిస్టరీగా మారింది. పోనీ గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తోందని అనుకున్నా దీని సమీపంలోకి మరే నౌక కూడా వెళ్లలేదు. ఈ నౌక మరో నౌకకు దగ్గరగా వెళ్లినా వీటి మధ్యదూరం 4 కిలోమీటర్లు ఉన్నట్టు నౌకలోని లోకేటర్‌ ఆధారంగా అర్జెంటీనా నావికాదళం నిర్ధారించింది. ఇక, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వైరస్ ఇంక్యుబేషన్‌ సమయం అత్యధికంగా 14 రోజులు. ‘ఏచిజన్‌ మార్’‌లోని నావికులు 14 రోజులు క్వారంటైన్‌లో, మరి కొన్నాళ్లు సముద్రంలో గడిపిన తర్వాత లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఇంక్యూబేషన్‌ సమయం ఇన్నాళ్లు ఉంటుందా అనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ఒక వేళ వస్తువులపై కరోనా ఉన్నా అది కొన్ని రోజులు మాత్రమే జీవిస్తుంది. ఈ నేపథ్యంలో పరిశోధకులు ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ప్రస్తుతం వైరస్ బారినపడ్డ నావికులను నౌకలోనే ఉంచి చికిత్స చేస్తున్నారు. అవసరమైన వారిని మాత్రమే ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఉషుయా ప్రాంతీయ ఆసుపత్రిలోని అంటు వ్యాధుల విభాగం అధిపతి, లియాండ్రో బల్లాటోర్ మాట్లాడుతూ.. ఇది పరిశోధనలకు అంతుచిక్కని కేసు అని తాను నమ్ముతున్నానని, ఎందుకంటే ఇంక్యుబేషన్ కాలం ఎక్కడా వివరించలేదన్నారు. లక్షణాలు ఎలా కనిపించాయో మేము ఇంకా వివరించలేమని బల్లాటోర్ అన్నారు.


By July 20, 2020 at 08:21AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/mystery-as-argentine-sailors-infected-with-coronavirus-after-35-days-at-sea/articleshow/77058280.cms

No comments