సెల్‌ఫోన్ వాడొద్దన్న తల్లిదండ్రులు.. ఉరేసుకుని యువతి ఆత్మహత్య
సెల్‌ఫోన్ ఎక్కువగా వాడొద్దని తల్లిదండ్రలు మందలించడంతో మనస్తాపం చెందిన డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా మండలం చిన్నచింతకుంటలో జరిగింది. గ్రామానికి చెందిన ఎంబరి లక్ష్మి, రమేష్ దంపతుల కుమార్తె మానస (19) నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతోంది. Also Read: కరోనా నేపథ్యంలో కాలేజీ ఇంకా తెరుచుకోకపోవడంతో ఇంట్లోనే ఉంటోంది. దీంతో రోజూలో ఎక్కువసేపు సెల్‌ఫోన్‌తోనే కాలం గడిపేస్తుండటంతో వారం రోజుల క్రితం తల్లిదండ్రులు మంలించారు. అప్పటి నుంచి మనస్తాపానికి గురై సరిగ్గా భోజనం చేయడం లేదు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చున్నితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. Also Read: మధ్యాహ్నం 3 గంటల సమయంలో తల్లి లక్ష్మి ఇంటికొచ్చి తలుపు తీయమని పిలవగా ఎంతకీ తీయలేదు. అనుమానం వచ్చి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా మానస దూలాకిని వేలాడుతోంది. దీంతో ఆమె స్థానికుల సాయంతో 108 వాహనంలో నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 19, 2020 at 08:52AM
No comments