గుంటూరులో ఇంటర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు... వీడియో వైరల్
జిల్లా మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, వేధింపుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిప బీటెక్ విద్యార్థిని నగ్నచిత్రాల కేసు మరువకముందే నరసరావుపేటకు చెందిన బీటెక్ విద్యార్థినిని న్యూడ్ వీడియోలతో బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మొదటి కేసులో పోలీసు దంపతుల కుమారుడిని నిందితుడిగా గుర్తించగా.. రెండో కేసులో నిందితుడికి ఇద్దరు కానిస్టేబుళ్లు సాయం చేశారని బయటపడింది. ఈ గందరగోళం మధ్యలోనే జిల్లాలో మరో ఘోరం బయటపడింది. Also Read: నిజాంపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి తీసిన వీడియోలు శనివారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. నిందితుడు వీడియోలో కనిపించకుండా జాగ్రత్తపడుతూ బాలిక పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా పోలీసులు స్వచ్ఛందంగా విచారణ చేపట్టారు. ఈ వీడియోలను పోస్ట్ చేసిన వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ను గుర్తించి స్టేషన్‌కు రావాలంటూ ఆదేశించారు. Also Read: ఈ వీడియోలను చిత్రీకరించిన వ్యక్తి ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడని, రాజకీయ పార్టీలో క్రియాశీలకంగానూ వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. దీంతో ఈ ఘటన కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ఆ వ్యక్తి గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడని, అతడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినశిక్ష పడేలా చేయాలంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని దారుణాలు బయటపడతాయని చెబుతున్నారు. Also Read:
By July 12, 2020 at 10:47AM
No comments