విశాఖ అక్కయపాలెంలో దారుణం.. కుటుంబంతో చేతిలో వ్యక్తి హత్య
విశాఖలో వరుస నేరాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అక్కయ్యపాలెంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సొంత కుటుంబసభ్యులే అతడ్ని హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నగరంలోని అక్కయ్యపాలెంలో జూలై11 80ఫిట్ రోడ్డులో దరి రామచంద్ర నగర్ లో శనివారం రాత్రి కస్తూరి ఆశోక వర్మ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.. కస్తూరి అశోక్ వర్మ అనే వ్యక్తి వయసు 29 ఏళ్లు. అశోక్‌ను తని తల్లి, అక్క బావ కలిసి హత్య చేశారు. రాత్రి 10 గంటల సమయంలో తల్లి కస్తూరి వరలక్ష్మీ, అక్క శ్రీదేవి, బావ వెంకటేశ్వరరాజు ముగ్గురు కలిసి అతడ్ని హతమార్చారు. అనంతరం నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు... వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్నవారితో పాటు.. స్థానికుల్ని సైతం పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబసభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. Read More: హత్యకు గురైన మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. అయితే కుటుంబ సభ్యులే అశోక్‌ను ఎందుకు హత్ చేశారన్న విషయం ఇంకా తెలియలేదు. ఇదే విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారి మధ్య ఆస్తి తగాదాలు కానీ, కుటుంబ తగాదాలు కానీ ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇతర బంధువులతో కూడా పోలీసులు మాట్లాడుతున్నారు.
By July 12, 2020 at 10:25AM
No comments