లిఫ్ట్ అడిగిన బైక్ కిందే పడి మహిళ మృతి.. భయంతో యువకుడి ఆత్మహత్య
ఎవరైనా మనకు లిఫ్ట్ అడిగితే సాధారణంగా కాదనలేం. అదే మనకు తెలిసినవారు మనఊరి వాళ్లు కనిపిస్తే.. నిర్భయంగా లిఫ్ట్ అడిగుతాం. కానీ మనం మంచి పనిచేయాలన్న కూడా విధి వెక్కిరిస్తే.. అదే మంచి మనకు చెడుగా మారుతోంది. ఓ యువకుడి విషయంలో ఇదే జరిగింది. బండిపై ఇంటికి వెళ్తున్న అతనికి రోడ్డుపై తన ఊరికి చెందిన ఓ మహిళ కనిపించింది. లిఫ్ట్ అడగడంతో ఆమెను బండిపై ఎక్కించుకొని ఇంటికి బయల్దేరాడు. మార్గం మధ్యలో బండి అదుపు తప్పింది. దీంతో మహిళ కిందపడింది. ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప అమ్రాబాద్ పంచాయతీ పరిధిలో ఆదివారం చోటు చేసుకొంది. చిన్న రోడ్డు ప్రమాదం రెండు నిరుపేద గిరిజన కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్రాబాద్ పంచాయతీ పరిధిలోని గుండ్యానాయక్ తండాకు చెందిన నివర్తి(24) పని నిమిత్తం మంచిప్ప వెళ్తున్నారు. అదే తండాకు చెందిన లక్ష్మీబాయి(52) మంచిప్ప వరకు తీసుకెళ్లాలని నివర్తిని కోరింది. సరే తమ గ్రామస్థురాలే కదా భావించి నివర్తి ఆమెకు లిఫ్ట్ ఇచ్చి బండి ఎక్కించుకున్నాడు. Read More: సగం దూరం వెళ్లాక వీరి వాహనం అదుపు తప్పడంతో కిందపడిన లక్ష్మీబాయి తలకి తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయింది. కళ్లెదుటే ఒకరు చనిపోవడంతో నివర్తి ఆందోళనకు గురయ్యాడు. లక్ష్మీ మృతికి నివర్తి కారణమంటూ అతనిపై కేసు పెడతామంటూ మృతురాలి బంధువులు బెదిరించారు. దీంతో భయపడి క్షణాల్లోనే ఇంటికి చేరుకున్నాడు నివర్తి. తనపై ఎక్కడ పోలీసు కేసు పెడతారోన్న ఆందోళనతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అరగంట వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు వదలడంతో తండాలో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో పోలీసులు ఇరు కుటుంబాల ఫిర్యాదులు సేకరించి కేసు నమోదు చేశారు.
By July 20, 2020 at 08:12AM
No comments