Breaking News

ప్రాణం తీసిన అనుమానం.. భార్యను గొంతు నులిమి చంపేసిన భర్త


భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ కిరాతక భర్త ఆమెను దారుణంగా చంపేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా మండలం పిప్పరలో చోటుచేసుకుంది. దేవరపల్లికి చెందిన మేడా అబ్బులుకు గణపవరానికి చెందిన చినమర్తి నంగాలమ్మ (20)తో రెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఓ బాబు(8 నెలలు) ఉన్నాడు. చేపల చెరువు వద్ద పని చేసేందుకు దంపతులిద్దరూ పదిరోజుల కిందట పిప్పర గ్రామానికి వచ్చారు. Also Read: అయితే నంగాలమ్మ ప్రవర్తనపై భర్తను కొద్దిరోజులుగా అనుమానం పెంచుకున్నాడు. ఆమె పరాయి వ్యక్తులతో నెరుపుతోందని అనుమానించేవాడు. దీంతో ఆమె ఎవరితో మాట్లాడినా అక్రమ సంబంధాలు అంటగట్టి వేధించేవాడు. దీంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున నిద్రపోతున్న నంగాలమ్మ మెడకు పసుపు తాడును బిగించడంతో అక్కడికక్కడే చనిపోయింది. Also Read: తర్వాత అబ్బులు కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గణపవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అబ్బులును ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నంగాలమ్మ తల్లి చినమర్తి వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By July 20, 2020 at 08:03AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-wife-in-west-godavari-district-over-suspects-illegal-affair/articleshow/77058150.cms

No comments