Breaking News

రెండు వారాలకే కొత్త కోడలికి వేధింపులు... పుట్టింట్లో ఉరేసుకున్న యువతి


ఓ యువతి ప్రాణాలను బలిగొన్నాయి. పెళ్లయిన రెండు వారాల నుంచే అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తుండటంతో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడు రాజధాని చెన్నైలోని చింతాద్రిపేట స్కూల్‌రోడ్డుకు చెందిన ఓ యువతికి హైదరాబాద్‌కు చెందిన నరేష్‌కుమార్‌(24) మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా పరిచయమయ్యాడు. రెండు కుటుంబాల అంగీకారంతో గతేడాది వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లయిన రెండు వారాలకే అత్తింటి వారు వరకట్నం కోసం వేధించసాగారు. Also Read: దీంతో ఆమె చెన్నైలోని పుట్టింటికి వచ్చేసింది. కొద్ది నెలల క్రితం చెన్నైకి వెళ్లిన నరేష్‌కుమార్ లాక్‌డౌన్ కారణంగా చింతాద్రిపేటలోని అత్తగారింట్లో చిక్కుకుపోయాడు. ఈ క్రమంలోనే తన కూతురిని కాపురానికి తీసుకెళ్లి మంచిగా చూసుకోవాలని యువతి తండ్రి అల్లుడిని కోరాడు. అయితే కట్నంగా 120 సవర్ల బంగారం అడిగితే 40 సవర్లు మాత్రమే ఇచ్చారని, మిగిలిన బంగారం కూడా ఇస్తేనే మీ కూతురిని కాపురానికి తీసుకెళ్తానని నరేష్‌కుమార్‌ చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి బుధవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By July 31, 2020 at 08:05AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-commits-suicide-in-chennai-over-dowry-harassment/articleshow/77274468.cms

No comments