చిత్తూరు: మైనర్ బాలికలపై మామిడితోటలో అఘాయిత్యం, నిందితుడికి దేహశుద్ధి
ఇద్దరు మైనర్ బాలికలను అపహరించడమే కాకుండా వారిపై లైంగిక దాడికి యత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన జిల్లా వి.కోట మండలంలో జరిగింది. మండల పరిధిలోని మిట్టూరులో గురువారం ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని గ్రామస్థులు గుర్తించారు. వారిలో ఓ యువకుడు గ్రామంలోని ఓ ఇంటి వద్ద ఆడుకుంటున్న ఇద్దరు బాలికల వద్దకు వెళ్లాడు. తాను తెచ్చిన కుక్క పిల్లతో ఆడుకుందాం రమ్మంటూ వారిని తన బైక్‌పై తీసుకెళ్లాడు. సమీపంలోని మామిడి తోటలో వారిపై లైంగిక దాడికి యత్నించగా బాలికలు కేకలు వేశారు. Also Read: దీంతో స్పందించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని యువకుడిని పట్టుకున్నారు. గ్రామం నడిబొడ్డున ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేసిన దేహశుద్ధి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తన పేరు రాజ్‌కుమార్(27)అని, రామకుప్పం మండలం కొంగనపల్లె తన స్వస్థలమని యువకుడు చెప్పాడు. ప్రస్తుతం వి.కోట మండల పరిధిలోని దొడ్డిపల్లెలో నివసిస్తూ, తాపీమేస్త్రిగా పనిచేస్తున్నట్లు వెల్లడించాడు. యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. Also Read:
By July 31, 2020 at 08:25AM
No comments