యాదాద్రి: కరోనా జాగ్రత్తలు చెప్పిన అత్తను కర్రతో చితకబాదిన కోడలు
రాష్ట్రంలో రోజురోజుకీ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైరస్ బారిన పడకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ అత్తాకోడళ్ల మధ్య చిచ్చు రేపింది. వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించిన అత్తను కోడలు కర్రతో చితకబాదిన ఘటన జిల్లా గౌరాయిపల్లి గ్రామంలో గురువారం జరిగింది. Also Read: యాదాద్రి జిల్లా గౌరాయిపల్లికి చెందిన పల్లె ఆండాలు భర్త బాలరాజు, కుమారుడు కృష్ణ కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆమె కోడలు, మనవళ్లతో కలిసి నివసిస్తోంది. ఇటీవల పల్లెల్లోనూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ‘ఇంట్లో పిల్లలున్నారు.. జాగ్రత్తలు పాటించాలని, ఎవ్వరినీ ఇంట్లోకి రానివ్వొద్దు’ అంటూ ఆండాలు తన కోడలుకు చెప్పింది. వయసు మీరడంతో చెప్పిన విషయాన్నే పదే పదే చెబుతుండటంతో కోడలికి కోపం వచ్చింది. Also Read: గురువారం కూడా ఆండాలు మళ్లీ అదే విషయాన్ని చెబుతుండంతో కోడలికి కోపం వచ్చి కర్రతో అత్తను చితకబాదింది. తలకు, కాళ్లకు గాయాలు కావడంతో ఆమె అరుపులు, కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకొని ఆండాలును రక్షించి ఆస్ప్రత్రికి తరలించారు. అనంతరం కోడలిపై ఆమె యాదగిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇంకా కేసు నమోదు చేయలేదని, అత్తాకోడళ్లను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామని ఎస్ఐ రాజు తెలిపారు. Also Read:
By July 31, 2020 at 07:47AM
No comments